
Bandla Ganesh- Ravi Teja: బండ్ల గణేష్ బడా చిత్రాల నిర్మాతగా మారి బిగ్ షాక్ ఇచ్చారు. నటుడైన ఆయన 2009లో ఆంజనేయులు చిత్రంతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. రవితేజ హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఆంజనేయులు విజయం సాధించలేదు. నెక్స్ట్ మూవీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సెట్ చేశాడు. హిందీ హిట్ మూవీ లవ్ ఆజ్ కల్ రీమేక్ గా తెరకెక్కిన తీన్ మార్ నిర్మించారు. ఈ చిత్రం సైతం నిరాశపరిచింది. అయితే మూడో ప్రయత్నంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. తీన్ మార్ ఆడని క్రమంలో పవన్ బండ్ల గణేష్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ భారీ విజయం నమోదు చేసింది.
ఆ దెబ్బతో బండ్ల గణేష్ నిలదొక్కుకున్నారు. 2015 వరకు టాప్ స్టార్స్ తో బండ్ల వరుసగా సినిమాలు చేశారు. ఎన్టీఆర్ హీరోగా బాద్ షా, టెంపర్ తెరకెక్కించారు. అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిలతో, రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే చిత్రాలు నిర్మించారు. టెంపర్ అనంతరం బండ్ల గణేష్ సైలెంట్ అయ్యాడు. ఈ ఎనిమిదేళ్లలో మరో సినిమా విడుదల చేయలేదు. పవన్ కళ్యాణ్ ని ఒక సినిమాకు ఒప్పించాలని ఆయన తెగ ప్రయత్నం చేశారు. కానీ కుదర్లేదు.
తాజాగా హీరో రవితేజను లైన్లో పెట్టాడని టాలీవుడ్ టాక్. వరుస హిట్స్ తో ఫార్మ్ లో ఉన్న రవితేజ… బండ్ల గణేష్ కి హామీ ఇచ్చారట. నీకు ఒక మూవీ చేస్తాను అన్నారట. రవితేజ నెక్స్ట్ ప్రకటించే కొత్త ప్రాజెక్ట్ కి బండ్ల గణేష్ నిర్మాతయ్యే అవకాశం కలదంటున్నారు. ఈ మధ్య రవితేజ కూడా నిర్మాత అయ్యారు. రవితేజ టీమ్ వర్క్స్ పేరుతో బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. కాబట్టి బండ్ల గణేష్ తో పాటు రవితేజ నిర్మాతగా ఉండి, నటించే సూచనలు కలవు.

దర్శకుడు గోపీచంద్ మలినేని నెక్స్ట్ ప్రాజెక్ట్ కి హీరో కోసం వెతుకుతున్నాడు. రవితేజతో ఆయనకున్న సాన్నిహిత్యం హిట్ ట్రాక్ రీత్యా అడగ్గానే ఓకే చేస్తారనడంలో సందేహం లేదు. ఒకవేళ రవితేజ-గోపీచంద్ మలినేని కాంబో సెట్ అయితే, ఆ మూవీ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ బండ్ల గణేష్ కి దక్కితే… ఆయనకు లక్ చిక్కినట్లే. ఇక ఏం జరుగుతుందో చూడాలి. రవితేజ నటించిన రావణాసుర రావణాసుర ఏప్రిల్ 7న విడుదల కానుంది. అలాగే రవితేజ బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటిస్తున్నారు.