Ravi Teja Son: సినిమాల్లో వారసత్వం వెరీ కామన్. ఫ్యాన్స్ కూడా దాన్ని బలంగా కోరుకుంటారు. ఒక స్టార్ కొడుకు హీరోగా తండ్రి సినిమా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్న రవితేజ కుమారుడు మహాదాన్ వయసుకు రాగా అతడు హీరో అవుతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. అది కూడా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉన్న ఇడియట్ సీక్వెల్ తోనట. కొన్నాళ్లుగా ఈ న్యూస్ తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా ఉంది. 2002లో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇడియట్ భారీ విజయం సాధించింది.

రవితేజకు స్టార్డం, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిన చిత్రం ఇడియట్ గా చెప్పవచ్చు. రవితేజ ఈ చిత్రం తర్వాత పరిశ్రమలో కుదురుకున్నాడు. ఆయనకు హీరోగా వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇడియట్ మూవీలో హీరో మేనరిజం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పూరి ఆలోచనలకు అనుగుణంగా రవితేజ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అప్పట్లో ఇడియట్ యూత్ ని ఊపేసింది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అందించిన సాంగ్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. పూరి కెరీర్లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఇడియట్ ని చెప్పుకోవచ్చు.
ఈ సినిమా సీక్వెల్ అంటే సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ రవితేజ కుమారుడు మహాదాన్ హీరోగా అనగానే ఇది హాట్ టాపిక్ అయ్యింది. కాగా దీనిపై రవితేజ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రవితేజను విలేకరులు ఈ ప్రశ్న అడిగారు. అయితే రవితేజ ఈ రూమర్స్ కొట్టిపారేశారు. ఇడియట్ 2 మహాదాన్ తో చేయాలన్న ఆలోచన లేదు. వినడానికి కూడా ఈ విషయం కొత్తగా ఉందని స్పష్టత ఇచ్చారు. రవితేజ స్టేట్మెంట్ ఆయన ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేసింది.

కాగా మహాదాన్ ఆల్రెడీ నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. రాజా ది గ్రేట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ మూవీలో రవితేజ చిన్నప్పటి పాత్రను మహాదాన్ చేశారు. ఇడియట్ సీక్వెల్ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే… మహాదాన్ హీరో కావడం మాత్రం నిజం. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాదాన్ అన్ని విధాలుగా పరిపక్వత సాధించాక వెండితెరకు హీరోగా పరిచయం చేయనున్నారు.