Rashmika Mandanna: కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగు లో వరుస బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకొని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది రష్మిక..ఇండియా ప్రతి టాప్ స్టార్ హీరో ఇప్పుడు రష్మిక ని తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు క్యూ కడుతున్నారు..పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడం రష్మికకి బాగా కలిసి వచ్చింది.

బాలీవుడ్ లో కూడా ఆమెకి రణబీర్ కపూర్ వంటి స్టార్ హీరో సరసన నటించే అదృష్టం దక్కింది..సందీప్ వంగా మరియు రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎనిమల్’ అనే సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా కనుక పెద్ద హిట్ అయితే రష్మిక బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిపోతారు..వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సినిమా తో పాటుగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ‘పుష్ప ది రూల్’ కోసం కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇక రష్మిక లేటెస్ట్ గా మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుంది..ఈ ఐటెం సాంగ్ చేస్తున్నందుకు గాను ఆమెకి నిర్మాతలు 5 కోట్ల రూపాయిల పారితోషికం ఇస్తున్నారట..ఒక ఐటెం సాంగ్ కోసం ఇంత మొత్తం లో పారితోషికం ఇప్పటి వరుకు ఇండియా లో ఏ హీరోయిన్ అందుకోలేదు..ఆ ఘనత రష్మిక కి మాత్రమే దక్కింది..దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఆమెకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అనేది.

ఇక ప్రస్తుతం ఆమె విజయ్ తో కలిసి చేస్తున్న ‘వారిసు’ అనే సినిమా సంక్రాంతికి విడుదల కానుంది..తెలుగు లో ఈ చిత్రాన్ని వారసుడు పేరుతో విడుదల చెయ్యబోతున్నారు..దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘రంజితమే’ అనే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది.