https://oktelugu.com/

పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మి.. ఏమందంటే?

జబర్ధస్త్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ వివాహం ఫిక్స్ అయిందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ సంవత్సరం చాలా మంది టాలీవుడ్ నటులు పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టాప్ హీరోయిన్ కాజల్ కూడా పెళ్లిరి రెడీ అవ్వడాన్ని చూశాము. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ తాజాగా రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో షాకిచ్చింది. తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. చక్కని పెళ్లి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 11:18 AM IST
    Follow us on

    జబర్ధస్త్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ వివాహం ఫిక్స్ అయిందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ సంవత్సరం చాలా మంది టాలీవుడ్ నటులు పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టాప్ హీరోయిన్ కాజల్ కూడా పెళ్లిరి రెడీ అవ్వడాన్ని చూశాము.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    తాజాగా రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో షాకిచ్చింది. తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. చక్కని పెళ్లి చీర ధరించిన ఫొటోలు షేర్ చేసింది. దీంతో ఆమెకు కూడా పెళ్లికి రెడీ అయ్యిందని.. నిశ్చిత్తార్థం జరిగిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కాజల్ అగర్వాల్ కూడా తాజాగా అలానే చేయడంతో ఈ అనుమానాలకు బలం చేకూరినట్టైంది.

    Also Read: బిగ్ బాస్-4: ఈవారం హౌస్ నుంచి వెళ్లేది మాస్టారేనా?

    ప్రస్తుతం రష్మీ ఫొటోలు షేర్ చేయడంతో ఆమె పెళ్లి గురించి నెటిజన్ల ప్రశ్నలతో రష్మి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కానీ ఆమె వారికి స్పందించడం లేదు. ఈ పుకార్లపై మౌనం పాటిస్తోంది.

    రష్మి గౌతమ్ తన సహనటుడు సుడిగాలి సుధీర్ తో ఎఫైర్ పెట్టుకుందన్న ప్రచారం ఉంది. సుధీర్ ఇప్పటికే పుకార్లకు చెక్ చెప్పాడు.

    Also Read: బిగ్ బాస్-4: నోయల్ పరిస్థితి విషమం.. విషాదంలో కంటెస్టెంట్లు..!

    32 ఏళ్ల రష్మీ గౌతమ్ తెలుగు టెలివిజన్‌లో ప్రముఖ యాంకర్ గా ఉన్నారు. ఆమె రాబోయే ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమాలో ప్రధాన కథానాయికగా కూడా నటిస్తోంది.

    https://www.instagram.com/p/CG7vy3cD0wY/