https://oktelugu.com/

షాకింగ్ : వేణు మాధవ్ మృతికి పాలిటిక్స్ కారణమా?

తెలంగాణకు చెందిన వేణుమాధవ్ టాలీవుడ్లో టాప్ కామెడీయన్ గా ఎదిగాడు. కెరీర్లో మొదట్లో మిమిక్రీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. నటుడిగా.. కామెడీయన్ గా.. హీరోగా వేణుమాధవ్ రాణించాడు. సినిమాల్లో ఆయనకు మంచి కామెడీయన్ గానే గుర్తింపు వచ్చింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ వేణుమాధవ్ గత ఏడాది సెప్టెంబర్ 25న మృతిచెందాడు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి అనారోగ్య సమస్యలే కారణమని […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 11:32 AM IST
    Follow us on


    తెలంగాణకు చెందిన వేణుమాధవ్ టాలీవుడ్లో టాప్ కామెడీయన్ గా ఎదిగాడు. కెరీర్లో మొదట్లో మిమిక్రీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. నటుడిగా.. కామెడీయన్ గా.. హీరోగా వేణుమాధవ్ రాణించాడు. సినిమాల్లో ఆయనకు మంచి కామెడీయన్ గానే గుర్తింపు వచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    వేణుమాధవ్ గత ఏడాది సెప్టెంబర్ 25న మృతిచెందాడు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి అనారోగ్య సమస్యలే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆయన మృతికి అసలు కారణాలను ఆయన కుమారులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం సంచలనంగా మారింది.

    వేణుమాధవ్ చనిపోయి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన కుమారులు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన తండ్రి జ్ఞాపకాలను తలుచుకొని ఎమోషన్ అయ్యారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి.. సినిమా అవకాశాలు.. పాలిటిక్స్.. వేణు మాధవ్ మృతిపై వచ్చిన రూమర్స్ పై ఇంటర్వ్యూలో వారు క్లారిటీ ఇచ్చారు.

    Also Read:పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మి.. ఏమందంటే?

    వేణు మాధవ్ ఎక్కువగా తాగడం వల్లనే ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన చివరివరకు మాతో సంతోషంగానే ఉన్నారని తెలిపారు. అయితే డైట్ విషయంలో కాస్త కంట్రోల్ ఎక్కువ కావడం వల్ల అస్వస్థతకు గురయ్యారని.. ఆసమయంలోనే డెంగ్యూ బారినపడటంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని తెలిపారు.

    వేణుమాధవ్ తొందరగా ఆస్పత్రిలో చేరకపోవడంతో పరిస్థితి సీరియస్ అయిందని వాపోయారు. ఆయనెప్పుడు బయట విషయాలను ఇంట్లోకి తీసుకు వచ్చేవారు కాదని తెలిపారు. అయితే వేణు మాధవ్ మృతిపై వచ్చిన రూమర్స్ తో ఆయన చాలా బాధపడ్డారని తెలిపారు. కావాలనే కొందరు ప్రత్యర్థి పొలిటికల్ నాయకులు రూమర్స్ స్పెడ్ చేశారని ఆయన కుమారులు తెలిపారు.

    Also Read: బిగ్ బాస్-4: ఈవారం హౌస్ నుంచి వెళ్లేది మాస్టారేనా?

    ఇక సినిమాపరంగా ఆయనను ఇండస్ట్రీలో ఎవరూ టార్గెట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. వేణుమాధవ్ కోరిక మేరకు తమ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పాలిటిక్స్ లో ఉంటారని తెలిపారు. తమ నాన్న చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చి కలిశారని.. చిరంజీవి గారూ కూడా తమతో మాట్లాడి యెగాక్షేమాలు కనుకున్నారని తెలిపారు.