
Rashmi Gautam: వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన సంఘటన సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలో పెట్, యానిమల్ లవర్స్ విమర్శల పాలవుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్ అయిన రష్మీ గౌతమ్ ని నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. వీధి కుక్కల హక్కుల గురించి పోరాడే నీవు ఈ సంఘటనకు ఏం సమాధానం చెబుతావని మండిపడుతున్నారు. నీలాంటి వాళ్ళు వీధి కుక్కలను అదుపు చేయనీయకుండా కేసులు వేసి అడ్డుకుంటున్నారు. దాంతో సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారని.. ఎద్దేవా చేస్తున్నారు.
నెటిజెన్స్ కామెంట్స్ కి రష్మీ తగ్గకుండా కౌంటర్లు ఇస్తుంది. అలా నేషనల్ హైవే మీదకు వెళ్లి చూడండి ఎన్ని మూగ జీవాలు వాహనాల క్రింద పడి మరణిస్తున్నాయో. వాటివి మాత్రం ప్రాణాలు కావా, అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా రష్మీ గౌతమ్-నెటిజన్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది. కాగా ఓ నెటిజన్ ‘ఈ కుక్క రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అని ఆమెను ట్యాగ్ చేసి కామెంట్ చేశాడు.
సదరు కామెంట్ పై రష్మీ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ‘అలాగే… దయచేసి నీ అడ్రస్ పంపు . నేనే స్వయంగా వస్తాను. చూస్తా నువ్వేం చేస్తావో. ఇది నా ఓపెన్ ఛాలెంజ్,’ అని రిప్లై పోస్ట్ చేసింది. రష్మీ ఛాలెంజ్ మాస్ హీరో సినిమా డైలాగ్ కి మించి ఉంది. టైం, ప్లేస్ చెప్పు కొట్టుకుందాం అని సవాల్ విసిరింది. రష్మీ డేరింగ్ అండ్ డాషింగ్ ట్విట్టర్ పోస్ట్ వైరల్ గా మారింది. వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే సామెత ఉంది. అలాగే వీధి కుక్కల దాడి ఘటనతో రష్మీకి ఎలాంటి సంబంధం లేకపోయినా యానిమల్ లవర్ అయిన కారణంగా టార్గెట్ అయ్యారు.

చాలా కాలంగా రష్మీ మూగజీవాల కోసం ఉద్యమం చేస్తున్నారు. ప్రాణులు హింసకు గురైనట్లు రష్మీ దృష్టికి వస్తే… వెంటనే స్పందిస్తారు. తగు అధికారులు ఫిర్యాదు చేస్తారు. జంతువులపై ప్రేమతో రష్మీ వీగన్ గా మారారు. ఆమె పూర్తిగా శాకాహారి. పాలు, గుడ్లు కూడా తినరు. వాటి కోసం జంతువులను హింసిస్తున్నారని ఆమె నమ్మకం. కాగా బాలుడు మృతి ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. యానిమల్ లవర్ అయిన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గద్వాల్ పై విమర్శల దాడికి దిగారు.
Sure
Pls share your address I’ll come personally
Let’s see how you can handle the situation then
It’s an open challenge https://t.co/SMhAIhWWY4— rashmi gautam (@rashmigautam27) February 24, 2023