https://oktelugu.com/

పవన్ స్టార్ ను కిచిడీ చేస్తున్న రాంగోపాల్ వర్మ

‘శివ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ తీసి తెలుగు సినిమాకు కొత్త ఒరవడి నేర్పిన క్రియేటివ్ దర్శకుడు వర్మ.. 2020 వచ్చేసరికి ఆ సృజనాత్మకత అంతా చచ్చుబడిపోయి ఇప్పుడు బూతు సినిమాలు తీసుకొని బతికే కాలం వస్తుందని ఎవరైనా ఊహించారా? కానీ అదే జరిగింది. అడపదడపా వివాదాస్పద అంశాలపై సినిమాలు ప్రకటిస్తూ కొన్ని తీస్తూ కొన్ని వదిలేస్తూ హీరోయిన్లతో అలా అలా కాలం గడిపేస్తున్నారు. Also Read: క్రైమ్ ని చేధించే ఐ ఐ టి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 5, 2020 / 07:49 PM IST
    Follow us on

    ‘శివ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ తీసి తెలుగు సినిమాకు కొత్త ఒరవడి నేర్పిన క్రియేటివ్ దర్శకుడు వర్మ.. 2020 వచ్చేసరికి ఆ సృజనాత్మకత అంతా చచ్చుబడిపోయి ఇప్పుడు బూతు సినిమాలు తీసుకొని బతికే కాలం వస్తుందని ఎవరైనా ఊహించారా? కానీ అదే జరిగింది. అడపదడపా వివాదాస్పద అంశాలపై సినిమాలు ప్రకటిస్తూ కొన్ని తీస్తూ కొన్ని వదిలేస్తూ హీరోయిన్లతో అలా అలా కాలం గడిపేస్తున్నారు.

    Also Read: క్రైమ్ ని చేధించే ఐ ఐ టి ముంబై జీనియస్ కృష్ణమూర్తి

    అయితే తెలుగునాట పిచ్చ క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్ పై అప్పట్లో వర్మ తీసిన ‘పవర్ స్టార్’ సినిమా బాగా హైప్ వచ్చింది. దాన్ని కొద్ది నెలల క్రితం ఏటీటీలో డబ్బులు పెట్టి చూసేలా వర్మ రిలీజ్ చేశారు. ఆ అరగంట షార్ట్ ఫిల్మ్ తుస్సుమంది. దాంట్లో విషయం లేకపోవడంతో వర్మ ‘పవర్ స్టార్’ ఫ్లాప్ అయ్యింది. అందులో వర్మ స్వయంగా నటించి పవన్ కు సలహాలు ఇవ్వడం విశేషం.

    ఆ సినిమా విడుదల వేళ వర్మపై దాడులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు అదే ‘పవర్ స్టార్’ సినిమాను తాజాగా మెగా ఫ్యామిలీ క్యారెక్టర్లు అన్ని కలిపి ‘ఆర్జీవీ మిస్సింగ్’ పేరుతో వర్మ సినిమా స్ట్రాట్ చేశాడు. అందులో మెగా ఫ్యామిలీ క్యారెక్టర్లు అన్నీ ఉన్నాయంటూ టీజర్ వదిలాడు.

    Also Read: అవినాష్ ని కాలితో తన్నిన మోనాల్, నాగార్జున వద్దకు పంచాయితీ..!

    ఇక కరోనా టైంలో వర్మ గోవా వెళ్లి ఈ సినిమాను పూర్తి చేశాడు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నాడట.. ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా ఆరంభంలోనో.. చివర్లోనే ఎక్కడో అక్కడ వర్మ ఇదివరకు తీసిన ‘పవర్ స్టార్’ సినిమాను మొత్తం పెట్టేశాడట.. ‘ఆర్జీవీ మిక్సింగ్’ సినిమాలో పవర్ స్టార్ మిక్స్ చేసి కిచిడీ కొట్టేశాడట.. చూసే ప్రేక్షకుడి ఖర్మకు వదిలేశాడట.. మరి ఈ సినిమా అయినా ఆడుతుందా? మరోసారి పాత ఫలితమే పునరావృతమవుతుందా అన్నది వేచిచూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్