https://oktelugu.com/

Brahmastra First Review: ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే ?

Brahmastra First Review: ఈ వారం రాబోతున్న క్రేజీ మూవీ ‘బ్రహ్మాస్త్ర’.  అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో  గ్రేట్  అమితాబ్ బచ్చన్, కింగ్  నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. అన్నిటికీ మించి క్రేజీ కపుల్ రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించారు.  మరి  ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?,  ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  వారి కోసం  ఈ సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసింది.  ఈ సినిమాను […]

Written By: Shiva, Updated On : September 8, 2022 11:34 am
Follow us on

Brahmastra First Review: ఈ వారం రాబోతున్న క్రేజీ మూవీ ‘బ్రహ్మాస్త్ర’.  అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో  గ్రేట్  అమితాబ్ బచ్చన్, కింగ్  నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. అన్నిటికీ మించి క్రేజీ కపుల్ రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించారు.  మరి  ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది ?,  ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  వారి కోసం  ఈ సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసింది.  ఈ సినిమాను ఆల్ రెడీ చూసిన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ ..  ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు.   ఇంతకీ  ఈ రివ్యూలో ఏమి చెప్పారో తెలుసుకుందాం.
విశ్లేషణ :  

Brahmastra First Review

ranbir kapoor

“బ్రహ్మాస్త్ర”  గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. మాస్ ప్రేక్షకులకు పర్వాలేదు అనిపించే  సినిమా.  ఐతే,  “బ్రహ్మాస్త్ర సినిమాలో చెప్పుకునేంతగా గొప్ప కథ ఏమి లేదు. అయితే, స్క్రిప్ట్ పరంగా  సినిమా స్టార్టింగ్ బాగుంది. కానీ, ఆ తర్వాత స్క్రీన్ ప్లే బాగా బోర్  గా సాగింది.   ఒక్కమాటలో  సినిమా జనాలని కట్టిపడేసే లాగా లేదు. సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర నిలవడం దాదాపు  కష్టమే అని అంటున్నారు.

Also Read: Prabhas Look: ప్రభాస్ కి ఏమైంది… బాబోయ్ ఏంటి ఇలా అయిపోయాడు

ఇక  ఈ సినిమాలో  పాజిటివ్ విషయాలకు వస్తే..  బ్రహ్మాస్త్ర సినిమాలో  విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. రెండు యాక్షన్ సీన్స్ కూడా అయితే  చాలా బాగా తీశారని..  ఇక పాటలు కూడా  చాలా బాగున్నాయి అని అంటున్నారు.  నటీనటుల నటన విషయానికి వస్తే..  “రణబీర్ కపూర్ నటన బాగాలేదు. అతను చాలా సీన్స్ లో  అయోమయంగా కనిపిస్తున్నాడు.  అసలు అతను తెరపై ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. అంత దారుణంగా అతను ఈ సినిమాలో నటించాడు.

Brahmastra First Review

ranbir kapoor

ఇక హీరోయిన్ గా నటించిన  ఆలియా భట్ నటన మాత్రం చాలా బాగుంది. చూడటానికి కూడా ఆలియా భట్ చాలా అందంగా కనిపిచింది. సినిమా కథాకథనాల విషయానికి వస్తే.. మాస్ ఆడియన్స్ కి కావాల్సిన  అన్ని అంశాలు ఈ సినిమాలో ఫుల్ గా ఉన్నాయి. కానీ ఏదీ పూర్తి స్థాయిలో కిక్ ఇవ్వదు. పైగా  కొన్ని సీన్స్ లో అస్సలు లాజిక్ ఉండదు. పైగా ఈ సీన్స్ బోర్ గా సాగాయి. సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే నే అంచనాలకు తగ్గట్టుగా లేదు.

తీర్పు : 

హిస్టారికల్ ఫిక్షనల్  యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి.  అలాగే సినిమా మెయిన్ పాయింట్ లో  కంటెంట్ బాగుంది.  కానీ,  రొటీన్ అండ్ బోరింగ్  వ్యవహారాలతోనే  ఈ “బ్రహ్మాస్త్ర”  సాగింది. దాంతో ఈ “బ్రహ్మాస్త్ర”  అంచనాలను  ఏ మాత్రం అందుకోలేకపోయింది.

Also Read:Venu Madhav: వేణు మాధవ్ మృతికి ఆ వ్యసనాలు కారణమా? భార్య వెల్లడించిన షాకింగ్ నిజాలు!

Tags