https://oktelugu.com/

Prabhas Look: ప్రభాస్ కి ఏమైంది… బాబోయ్ ఏంటి ఇలా అయిపోయాడు

Prabhas Look: ప్రభాస్ కి ఇమేజ్ తెచ్చిపెట్టిన అంశాల్లో ఆయన అందం కూడా ఒకటి. ఆరడగుల ఎత్తు, హోమ్లీ ఫేస్ ప్రభాస్ సొంతం. ఈ ఫీచర్స్ ప్రభాస్ ని అమ్మాయిల కలల రాకుమారుడిగా మార్చేశాయి. ప్రభాస్ నటించిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలు ఆయనకు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చిన ప్రభాస్ స్టార్ అయ్యారు. బాహుబలి 2 వరకు ప్రభాస్ లుక్ […]

Written By:
  • Shiva
  • , Updated On : September 8, 2022 / 11:13 AM IST
    Follow us on

    Prabhas Look: ప్రభాస్ కి ఇమేజ్ తెచ్చిపెట్టిన అంశాల్లో ఆయన అందం కూడా ఒకటి. ఆరడగుల ఎత్తు, హోమ్లీ ఫేస్ ప్రభాస్ సొంతం. ఈ ఫీచర్స్ ప్రభాస్ ని అమ్మాయిల కలల రాకుమారుడిగా మార్చేశాయి. ప్రభాస్ నటించిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలు ఆయనకు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చిన ప్రభాస్ స్టార్ అయ్యారు. బాహుబలి 2 వరకు ప్రభాస్ లుక్ పర్ఫెక్ట్ గా ఉంది. రెండేళ్ల గ్యాప్ లో ఏమైందో తెలియదు కానీ.. సాహో నాటికి ప్రభాస్ లో చాలా చేంజెస్ కనిపించాయి.

    సాహో చిత్రంలో ప్రభాస్ ఫేస్, హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా కనిపించాయి. ఒకప్పటి ఆ గ్లామర్ ఏమైంది అన్నట్లు ముఖం తయారైంది. కొన్ని సాంగ్స్ లో పెదాలు డ్రై గా కనిపించాయి. గొంతు కూడా గంభీరంగా మారిపోయింది. సినిమాలో చాలా చోట్ల డైలాగ్స్ అర్ధం కాలేదు. సాహో ఫెయిల్యూర్ వెనుక ప్రభాస్ లుక్ కూడా కారణమే వాదన ఉంది. అప్పటి నుండి ప్రభాస్ మునుపటిలా కనిపించడం లేదు.

    Also Read: Venu Madhav: వేణు మాధవ్ మృతికి ఆ వ్యసనాలు కారణమా? భార్య వెల్లడించిన షాకింగ్ నిజాలు!

    కొన్నాళ్లుగా ఆయన ఫేస్ లో ఏజ్ కనిపిస్తుంది. ఆదిపురుష్ షూటింగ్ సమయంలో బాలీవుడ్ మీడియా ప్రభాస్ లుక్ పై సెటైర్స్ వేస్తూ కథనాలు ప్రచురించింది. తాజాగా ప్రభాస్ మరింత దారుణంగా కనిపిస్తున్నాడు. ఆయన బరువు పెరిగి షేప్ అవుట్ అయ్యారనిపిస్తుంది. హీరో అల్లు అర్జున్, ప్రభాస్ కలిసి ఫోటోకి ఫోజిచ్చారు. ఈ ఫొటోలో ప్రభాస్ లుక్ అసలేం బాగోలేదు. ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూసిన జనాలు, ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఆరోగ్యం, ఫిట్నెస్ పై కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు. వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం సరికాదన్న వాదన వినిపిస్తుంది. బాహుబలి పుణ్యమా అని దేశంలోనే అతిపెద్ద హీరోగా ప్రభాస్ ఎదిగారు. అది కంటిన్యూ చేయాలంటే ప్రభాస్ ఫిట్నెస్, హెల్త్ మైంటైన్ చేయాలి.

    Prabhas

    ఇప్పటికే వరుసగా రెండు డిజాస్టర్స్ ప్రభాస్ ఖాతాలో చేరాయి. ఆయన్ని సిల్వర్ స్క్రీన్ పై చూస్తుంటే ఒకప్పటి ఫీల్ రావడం లేదు. ఇప్పటికైనా ప్రభాస్ దురలవాట్లను దూరం పెట్టి, ఆరోగ్యంఫై శ్రద్ధ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ డూప్ తో సలార్ లాగించేస్తున్నాడన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక సలార్ తో పాటు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే చిత్రాలు ప్రభాస్ చేస్తున్నారు.

    Also Read:Pawan Kalyan- Rajamouli: పవన్ కల్యాణ్ తిరస్కరించిన రాజమౌళి సినిమా ఏదో తెలుసా?

    Tags