Brahmastra First Review UAE: రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంటగా నటించిన కొత్త సినిమా బ్రహ్మాస్త్ర. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అయింది. కాగా ఈ సినిమా ఫస్ట్ యూఎస్ రివ్యూ వచ్చేసింది. ఇతర దేశాల్లో కొన్ని ప్రీమియర్ షోలు పడ్డాయి. యూఎస్ ప్రేక్షకులు విజిల్స్ తో కేకలతో ఊగిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా.. అది సాధ్యపడలేదు అట. అలా ఉంది అన్నమాట సినిమా.
సినిమా చూసిన యూఎస్ ప్రేక్షకుల్లో ఎక్కువమంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. బ్రహ్మాస్త్ర ప్రపంచ స్థాయిలో వచ్చిన జస్ట్ యావరేజ్ సినిమా అని.. సింపుల్ గా చెప్పాలంటే బ్రహ్మాస్త్రలో మ్యాటర్ మిస్ అయిందని చెప్పుకొచ్చారు.
Also Read: Brahmastra First Review: ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే ?
ఇంతకీ యూఎస్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.
విశ్లేషణ :
నటి నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా ఆలియా గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఆర్ఆర్ఆర్ తో ఆలియా రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. పైగా రణబీర్ కపూర్ తో ఆమె కలిసి నటించింది. దాంతో బ్రహ్మస్త్ర పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అన్నిటికీ మించి ఆలియా ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకుంది. చాలా బాగా నటించింది. ఇక మాచో వారియర్ లుక్ నుంచి స్టైలిష్ లవర్ బాయ్ లుక్ లోకి మారిపోయిన రణబీర్ కపూర్ కూడా బాగానే నటించాడు.
కానీ, ఎందుకో రణబీర్ కపూర్ నటన అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. కాకపోతే, తన లుక్ కోసం రణబీర్ కపూర్ పడిన కష్టం గురించి మెచ్చుకోవాల్సిందే. మొత్తానికి రణబీర్ కపూర్ ఈ సినిమాకి తన తరపున చేయగలిగినంత చేసాడు. ఇక అమితాబ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో ఉన్న లార్జ్ స్టార్ కాస్ట్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గ, క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రల్లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా నాగార్జున కూడా తన పాత్రతో చాలా బాగా ఆకట్టుకున్నారు.
ఫస్ట్ హాఫ్ లో రణబీర్ కపూర్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. రణబీర్ కపూర్ – ఆలియాల కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. కథ విషయానికి ఇది ఒక యూనిక్ సబ్జెక్టు. కానీ, స్క్రీన్ ప్లే విషయంలో బాగా తేలిపోయింది. అలాగే ఎమోషనల్ గా సాగే ఈ సినిమాలో మెయిన్ ఎమోషన్స్ పండలేదు. అది పెద్ద మైనస్ అయ్యింది సినిమాకి.
తీర్పు :
సాంకేతికంగా విజువల్ పరంగా ఈ బ్రహ్మస్త్ర సినిమా ఒక మాస్టర్ పీస్. అలాగే యాక్షన్ సన్నివేశాలతో పాటు విజువల్స్ హాలీవుడ్ సినిమా స్థాయిలో అదిరిపోయాయి. కానీ, కంటెంట్ పరంగా ప్లాప్ సినిమా. కథాకథనాలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. స్క్రిప్ట్ పై ఇంకా వర్క్ చేయాల్సింది. ఒక్క మాటలో ఈ సినిమా జస్ట్ ఏవరేజ్ సినిమా.
Also Read:Pawan Kalyan- Rajamouli: పవన్ కల్యాణ్ తిరస్కరించిన రాజమౌళి సినిమా ఏదో తెలుసా?