
Rana Wife Miheeka Bajaj: ప్రేమికుల రోజు అందరికీ ప్రత్యేకమే. దగ్గుబాటి రానా వైఫ్ మిహికా బజాజ్ సైతం భర్తను పొగడ్తలతో ముంచెత్తుతూ ఓ పోస్ట్ పెట్టారు. ‘స్ట్రాంగ్, స్వీట్, ఎలిగెంట్, ప్రెట్టి, వైల్డ్ అండ్ వండర్ఫుల్.. వర్ణించడానికి పదాలే కరువయ్యాయి. నా ముఖంలో నవ్వులు నింపే లవింగ్ పర్సన్’ అంటూ మిహీకా రానా పై ఉన్న అపరిమిత ప్రేమను చాటుకున్నారు. ఈ పోస్ట్ పై వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత స్పందించారు. లవ్ సింబల్ పోస్ట్ చేస్తూ… అన్నావదిన సో క్యూట్ అని తెలియజేశారు. హార్ట్ సింబల్ పోస్ట్ చేశారు. మిహీకా బజాజ్ వాలెంటైన్ పోస్ట్ వైరల్ అవుతుంది.
కరోనా ఆంక్షల మధ్య రానా-మిహీకా వివాహం జరిగింది. వీరిది ప్రేమ పెళ్లి. మిహీకా బజాజ్ ని ప్రేమిస్తున్న విషయం రానా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 2020లో రానా-మిహీకా పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే రానా పెళ్ళికి హాజరయ్యారు. రెండేళ్ల వివాహ బంధం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. గత ఏడాది మిహీకా-రానా విడిపోతున్నారంటూ పుకార్లు లేచాయి. ఈ వార్తలను పరోక్షంగా సెలబ్రిటీ కపుల్ ఖండించారు. రానా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. అమెరికాలో ఆయన లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు.
మరోవైపు ఆయన సినిమాలు బాగా తగ్గించారు. విరాటపర్వం పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదు. దర్శకుడు గుణశేఖర్ తో హిరణ్యకశిప అనే పౌరాణిక చిత్రం చేయాల్సింది. ప్రీ ప్రొడక్షన్ కూడా జరుపుకున్న హిరణ్య కశిప మూవీ ఆగిపోయినట్లు సమాచారం. హిరణ్య కశిప మూవీ వేరే హీరోతో చేయనున్నట్లు ప్రచారం అవుతుంది. రానా నయా ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకపోవడం ఆయన అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.

ఇక ఆయన డెబ్యూ వెబ్ సిరీస్ రానా నాయుడు స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. రానా నాయుడు సిరీస్లో వెంకటేష్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఫస్ట్ టైం వెంకీ-రానా కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. రానా నాయుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. హాలీవుడ్ సక్సెస్ ఫుల్ వెబ్ సీరియస్ రే డొనోవన్ కి అధికారిక రీమేక్. రానా నాయుడు ట్రైలర్ విడుదల నేపథ్యంలో రానా, వెంకటేష్ వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. రానా నాయుడు-నాగా నాయుడు మధ్య జరిగే ఆధిపత్యపోరే రానా నాయుడు వెబ్ సిరీస్ అని సమాచారం.
View this post on Instagram