Garikapaati Vs RGV : ఆరోజు దుర్మూహర్తం ఉందో.. లేక గడిచిన గడియ బాగాలేదో ఏమో కానీ.. చిరంజీవిని అవమానించి గరికపాటి నరసింహారావు అడ్డంగా బుక్కయ్యారు. స్టేజీపై చిరంజీవి ఆడవాళ్లతో సెల్ఫీలు ఆపకపోతే వెళ్లిపోతానన్న ఒక్క మాట గరికపాటికి మైనస్ అయ్యింది. ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రవచనాలతో గుర్తింపు పొందిన గరికపాటి లూప్ హోల్స్ వెతికి మరీ జనాలు ట్రోల్స్ చేస్తున్నారు.

ఇన్నాళ్లు నెటిజన్లకే పరిమితమైన ఈ ట్రోలింగ్ ఇప్పుడు ఏకంగా సెలబ్రెటీల వరకూ చేరింది. ప్రముఖ హేతువాది బాబు గోగినేనితోపాటు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. గరికపాటి పాత వీడియోలు షేర్ చేసి ఆయనను ఏకిపారేస్తున్నారు.
గతంలో గరికపాటి ఆడవాళ్లపై చేసిన కామెంట్ల వీడియోను షేర్ చేసిన హేతువాది బాబు గోగినేని… గరికపాటిని ఉతికి ఆరేశారు. ‘తమరు రాసుకెళ్లి పోవడం ఆడవాళ్లకు ఇష్టమా? పిల్లల తల్లులను కూడా వదలరా? ఒక వ్యక్తిని చూస్తే మీకు లైంగిక పరమైన ఆలోచన తప్ప ఇంకేమీ రాదా? మీ దృష్టి నుండి ఆడవాళ్లు తమని తాము ఎలా కాపాడుకోవాలో ఇక ఆలోచించాలా? తెలుగు తాలిబాన్ పనులు ఆపి కళ్లకు గంతలు కట్టుకోండి.’ అంటూ కామెంట్ చేయడమే కాకుండా దానికి రాంగోపాల్ వర్మను ట్యాగ్ చేశారు.
అసలు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో ఇప్పుడు వర్మకు బాబు గోగినేని షేర్ చేసిన వీడియో అలా దొరికింది. వర్మ ఊరుకుంటాడా? దాన్ని పెంట పెంట చేశాడు. గతంలో ఇదే గరికపాటి అనుష్కపై చేసిన హాట్ కామెంట్ల వీడియోను వర్మ పోస్ట్ చేశాడు. అందులో ‘‘అనుష్క అందాల బికినీ ఫొటోను పేపర్లో చూసి తాను టెంప్ట్ అయ్యానని.. తానే కాగా లేనిది తమ కుమారుడు అలా అనుష్క ఫొటోను చూస్తుండడం చూసి వాడు కాడా? అనిపించదని’’ గరికపాటి స్వయంగా అన్న వీడియోను వర్మ షేర్ చేశాడు. దానికి ‘ఓహో మీకు కూడానా బాహు (గరిక) బలి గారు అంటూ ఎద్దేవా చేశారు. అహా అడ్డడ్డే అంటూ సెటైర్ వేశాడు.
What ? Whaaat? Whaaaattt? Whaaaaaattttt? https://t.co/kkF8zg8jat
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022
ఇలా చిరంజీవితో మహిళలు ఫొటో దిగితేనే ఇంత కోప్పడ్డ గరికపాటిని.. గతంలో అనుష్కను చూసి టెంప్ట్ అయ్యానని చెప్పిన వీడియోను.. మహిళల లిప్ స్టిక్ లు అంగాంగ ప్రదర్శనలపై నోరుజారిన వీడియోలను బయటకు తీసి మరీ నెటిజన్లు, సెలబ్రెటీలు వాయించేస్తున్నారు. ఈ వివాదంలోకి వర్మ, బాబు గోగినేని సైతం చేరి ఆడవాళ్లపై ఇంతగా మాట్లాడుతున్న గరికపాటిపై మహిళా సంఘాలు , రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్లు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. పోయి పోయి చిరంజీవిని అని గరికపాటి చాలా పెద్ద తప్పు చేశాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు..
OHO ! AAHAA! ADDDDADDDDDADDDADDE 😍😍😍 pic.twitter.com/aRGFu4i02H
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022