https://oktelugu.com/

Bheemla Nayak RGV: ‘భీమ్లానాయక్’ ట్రైలర్ పై రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్..

Bheemla Nayak RGV: ఇప్పుడు తెలుగునాట ‘భీమ్లానాయక్’ మేనియా కొనసాగుతోంది. నిన్నరాత్రి రిలీజ్ అయిన ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 30 నిమిషాల్లోనే 9 లక్షల వ్యూస్ సాధించి ఆర్ఆర్ఆర్, పుష్ప రికార్డు వ్యూస్ ను భీమ్లానాయక్ తుడిచిపెట్టేసింది. ఈ క్రమంలోనే భీమ్లానాయక్ ట్రైలర్ పై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత మేకర్స్ పై వర్మ సెటైర్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2022 / 09:09 AM IST
    Follow us on

    Bheemla Nayak RGV: ఇప్పుడు తెలుగునాట ‘భీమ్లానాయక్’ మేనియా కొనసాగుతోంది. నిన్నరాత్రి రిలీజ్ అయిన ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 30 నిమిషాల్లోనే 9 లక్షల వ్యూస్ సాధించి ఆర్ఆర్ఆర్, పుష్ప రికార్డు వ్యూస్ ను భీమ్లానాయక్ తుడిచిపెట్టేసింది. ఈ క్రమంలోనే భీమ్లానాయక్ ట్రైలర్ పై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

    Bheemla Nayak RGV

    తాజాగా భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత మేకర్స్ పై వర్మ సెటైర్లు వేశారు. భీమ్లానాయక్ ట్రైలర్ చూస్తే కొన్ని కారణాల వల్ల దుర్వినియోగం చేశారని అనిపిస్తోందని.. పవన్ కళ్యాణ్ ను తగ్గించి రానా దగ్గుబాటిని హైలెట్ చేశారని కనిపిస్తోందని వర్మ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ ట్రైలర్ చూసి తాను బాధపడ్డానని సెటైర్లు వేశారు.

    ట్రైలర్ లోని ప్రతీ ఫేమ్, సీన్లు చూస్తుంటే నిజాయితీగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ కనిపించలేదని.. మొత్తం రానా దగ్గుబాటి మాత్రమే కనిపించారని వర్మ ఎద్దేవా చేశారు. ట్రైలర్ మొత్తం రానా ప్రతాపమే కనిపించిందన్నారు.

    Also Read: Bheemla Nayak Trailer: జాతర చేస్తున్న పవన్‌ ఫ్యాన్స్‌.. కళ్ల ముందే అగ్నిగోళం

    ఇక ప్యాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన టాలీవుడ్ మూవీలపై కూడా వర్మ భీమ్లానాయక్ ను బేస్ చేసుకొని ఎద్దేవా చేశారు.వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. భీమ్లా నాయక్ ట్రైలర్ కు ఉత్తర భారతదేశంలో ఆదరణ లేదని.. బాహుబలితో హిందీ జనాలకు చిరపరిచితమైన రానాను చూసినా కూడా బాలీవుడ్ లో ఆదరణ దక్కలేదని వర్మ విమర్శించారు. పీకే సన్నిహితులు, మేకర్స్ ఇప్పటికైనా ఇలా జరగకుండా బాలీవుడ్ లోనూ పవన్ కళ్యాణ్ మేనియాను విస్తరింపచేయాలని సూచించారు. హిందీలో పవన్ ట్రైలర్ ఆదరణ లేకపోవడం చూసి తాను షాక్ అయ్యానని వర్మ సెటైర్లు వేశారు.

    మొత్తంగా వర్మ ‘భీమ్లానాయక్’లోని లూప్ హోల్స్ అన్నీ వెతికి పట్టుకోవడమే ధ్యేయంగా వరుస ట్వీట్లు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై సోషల్ మీడియాలోనూ పవన్ ఫ్యాన్స్ నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది.

    Also Read: Bheemla Nayak Theatrical Trailer: షాకింగ్.. ఏంటిది? ‘భీమ్లానాయక్’ మూవీలోని ఈ మూడింటిని గమనించారా?