Allu Arjun-Rajamouli combination: ఇండియాలో టాప్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్న రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తోందంటే చాలు ఆ మూవీ మీద ప్రేక్షకుల్లో అంచనాలు తార స్థాయి కి వెళ్ళిపోతాయి…అలాంటి రాజమౌళి తన కెరియర్ లో ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో ఒక సినిమా కూడా చేయలేదు. గతంలో వీళ్ళ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ రాబోతుందనే వార్తలు వినిపించినప్పటికి అవి నిజం కాదంటూ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. ఇక అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ‘వారణాసి’ సినిమా తర్వాత రాజమౌళి అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఇక ఈ విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట…ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమాలో అల్లు అర్జున్ ఒక అడవి మనిషిగా కనిపించబోతున్నాడట. 1980 నటి ఒక కథని ఆధారంగా తీసుకొని ఈ సినిమా స్టోరీ ని ప్రిపేర్ చేశారట. ఇక మహేష్ తో చేస్తున్న వారణాసి పాన్ వరల్డ్ తో సత్తా చాటితే అల్లు అర్జున్ తో చేయబోతున్న సినిమా మీద కూడా భారీ అంచనాలుండే అవకాశమైతే ఉంది.
మరి ఆ అంచనాలను తట్టుకొని నిలబడగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులైతే చేయబోతున్నాడట . ఇక విజయేంద్ర ప్రసాద్ సైతం ఈ కథ ను ఫుల్ ఫ్లెడ్జెడ్ గా రాస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందుకే ఈ సినిమా కు సంబంధించిన ఏ అప్డేట్ కూడా ప్రాపర్ గా చెప్పలేకపోతున్నారు… ఇక ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ మూవీ మేకింగ్ లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దాని మీదనే ఆయన పూర్తి ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…దాన్ని కాదని ఆయన ఇప్పుడు వేరే సినిమా మీద దృష్టి ని పెట్టడం అసాధ్యమనే చెప్పాలి…ఇక మహేష్ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడు.