https://oktelugu.com/

Gadwal Bidda Mallikarjuna Reddy: గ‌ద్వాల్ రెడ్డి బిడ్డ ఎలా ఫేమ‌స్ అయ్యాడు.. ఎలా చనిపోయాడు..?

Gadwal Bidda Mallikarjuna Reddy: సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత చాలామంది సెల‌బ్రిటీలు త‌యార‌య్యారు. ఒక‌ప్పుడు సినిమాల్లో న‌టిస్తేనే సెల‌బ్రిటీలుగా చూసేవాళ్లం. కానీ సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని త‌మ ట్యాలెంట్ తో చాలామంది పాపుల‌ర్ అయిపోయారు. అలాంటి వ్య‌క్తే గ‌ద్వాల్ రెడ్డి బిడ్డ‌. కాగా అత‌ను చిన్న వ‌య‌సులోనే ఎంత ఫేమ‌స్ అయ్యాడో.. అంత త్వ‌ర‌గా క‌న్నుమూశాడు. అయితే అత‌నికి సంబంధించిన కొన్ని విష‌యాల‌ను తెలుసుకుందాం. గద్వాల్ రెడ్డి బిడ్డ ఎవరు? గ‌ద్వాల్ జిల్లా […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 22, 2022 / 10:18 AM IST
    Follow us on

    Gadwal Bidda Mallikarjuna Reddy: సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత చాలామంది సెల‌బ్రిటీలు త‌యార‌య్యారు. ఒక‌ప్పుడు సినిమాల్లో న‌టిస్తేనే సెల‌బ్రిటీలుగా చూసేవాళ్లం. కానీ సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని త‌మ ట్యాలెంట్ తో చాలామంది పాపుల‌ర్ అయిపోయారు. అలాంటి వ్య‌క్తే గ‌ద్వాల్ రెడ్డి బిడ్డ‌. కాగా అత‌ను చిన్న వ‌య‌సులోనే ఎంత ఫేమ‌స్ అయ్యాడో.. అంత త్వ‌ర‌గా క‌న్నుమూశాడు. అయితే అత‌నికి సంబంధించిన కొన్ని విష‌యాల‌ను తెలుసుకుందాం.

    Gadwal Bidda Mallikarjuna Reddy

    గద్వాల్ రెడ్డి బిడ్డ ఎవరు?

    గ‌ద్వాల్ జిల్లా జిల్లెడు దిన్నెకు చెందిన మ‌ల్లికార్జున్ రెడ్డి.. చిన్న‌ప్ప‌టి నుంచే చాలా యాక్టివ్ గా ఉంటాడు. అయితే ఒకానొక స‌మ‌యంలో నువ్వు ఎవ‌రో నాకు తెలియ‌దు. మా జోలికి వ‌స్తే ఖ‌బ‌డ్దార్‌. నేను గద్వాల రెడ్డి బిడ్డ అంటూ చేసిన వీడియో ఒక‌టి బాగా వైర‌ల్ అయిపోయింది. అప్ప‌టి నుంచి అత‌ను గ‌ద్వాల రెడ్డి బిడ్డ‌గా సోష‌ల్ మీడ‌యా ప్రియుల‌కు ప‌రిచ‌య‌స్తుడు అయ్యాడు.

    Also Read:  రోజా కూతురు గురించి షాకింగ్ విషయాలు ?

    గద్వాల్ రెడ్డి ఎలా ఫేమస్ అయ్యారు?

    ఇక ఆ వీడియోతో ఫేమ‌స్ అయిపోయిన మ‌ల్లికార్జున్‌.. ఆ త‌ర్వాత అది కూడా క‌రెక్టే క‌దా సార్ అనే డైలాగ్ తో బాగా పాపులారిటీ సంపాదించాడు. ఇత‌ను స్పూఫ్ వీడియోలో ఎక్కువ‌గా చేస్తుంటాడు. ఇలా చిన్న చిన్న వీడియోల‌తోనే అత‌ను బాగా పేరు సంపాదించుకున్నాడు. కాగా ఆ మ‌ధ్య రామ్ గోపాల్ వ‌ర్మ మీద చేసిన వీడియో కూడా చాలా ఫేమ‌స్ అయిపోయింది. కాగా అత‌ను ఒక‌సారి ద‌ళితుల మీద చేసిన కామెంట్లు వివాదాస్ప‌దం కావ‌డంతో.. చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పాడు. అయితే సోష‌ల్ మీడియాలో ఇత‌ని పేరు మీద మీమ్స్‌, ట్రోల్స్ ఎక్కువ‌గా న‌డుస్తుంటాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే మీమ్స్ చేసే వారికి అత‌నో పెద్ద గ‌ని.

    Gadwal Bidda Mallikarjuna Reddy

    గద్వాల్ రెడ్డి ఎలా చనిపోయారు?

    మల్లికార్జున్ రెడ్డికి చిన్న‌ప్ప‌టి నుంచే ఆస్త‌మా ఉంది. దాంతో పాటే ఈ మ‌ధ్య ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు బాగా పెరిగిపోవ‌డంతో.. ప‌రిస్థితి చేయిదాటిపోయింది. చికిత్స పొందుతూనే అత‌ను క‌న్ను మూశాడు. అత‌నికి ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోయినా.. త‌న వాయిస్ తో ఎంతోమందికి వినోదం పంచిన అత‌ను చివ‌ర‌కు ఇలా చిన్న వ‌య‌సులోనే క‌న్ను మూశాడు.

    Also Read:  మాసివ్ అవతార్ తో అదరగొట్టిన బాలయ్య

    Recommended Video:

    Tags