Homeఎంటర్టైన్మెంట్BheemlaNayak Theatrical Trailer : భీమ్లా నాయక్ దెబ్బకు కొట్టుకుపోయిన ‘ఆర్ఆర్ఆర్’, పుష్ప రికార్డులు

BheemlaNayak Theatrical Trailer : భీమ్లా నాయక్ దెబ్బకు కొట్టుకుపోయిన ‘ఆర్ఆర్ఆర్’, పుష్ప రికార్డులు

BheemlaNayak trailer that broke RRR, Puspa and records : పవర్ స్టార్’ పవర్ ఏంటో తెలిసి వచ్చింది. పవన్ అడుగుపెడితే రికార్డులు బద్దలు అవుతాయని స్పష్టమైంది. సినిమాల గ్యాప్ తో కసిగా రగిలిపోయిన పవన్ కళ్యాణ్ వీరావేశం ‘భీమ్లానాయక్’ సినిమాతో బద్దలైంది. ఆ ఊపు, ఆ గ్రేస్ కు రికార్డు వ్యూస్ వచ్చిపడుతున్నాయి.

కొద్దిసేపటి క్రితం విడుదలైన భీమ్లానాయక్ మూవీ ట్రైలర్ అదిరిపోయింది. పవన్ వీరావేశానికి.. రానా పంతానికి మధ్య సాగిన యుద్ధంగా ఉంది. ఇక భీమ్లానాయక్ తగ్గ భార్యగా నీత్యమీనన్ ఇరగదీసింది. ఒంటిపై యూనిఫాం చూసుకొని చెలరేగిపోయే భర్తకు ఇంకాస్త రెచ్చగొట్టే పవర్ ఫుల్ లేడీగా కనిపించారు.

పవన్ రానా ఇద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో ‘భీమ్లానాయక్ ’ ట్రైలర్ రుచిచూపించింది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. అతడిని ధీటుగా ఎదురించే విలన్ గా రానా అంతే ఆవేశపూరితంగా నటించాడు. ఇద్దరు కొదమ సింహాల్లా సాగిన ఈ ట్రైలర్ ఆసాంతం పవన్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేలా ఉంది.

‘పులి పెగ్గేసుకొని పడుకుంది కానీ స్లోగా పోనీయ్’ అని పవన్ స్టామినా గురించి రానా చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. పవన్ వీరావేశానికి.. రానా పంతానికి మధ్య సాగిన యుద్ధంగా ఉంది. ఇక భీమ్లానాయక్ తగ్గ భార్యగా నీత్యమీనన్ ఇరగదీసింది. ఒంటిపై యూనిఫాం చూసుకొని చెలరేగిపోయే భర్తకు ఇంకాస్త రెచ్చగొట్టే పవర్ ఫుల్ లేడీగా కనిపించారు.

ట్రైలర్ విడుదలైన అరగంటలో కేవలం 30 నిమిషాల్లోనే 9,33,580 వ్యూస్ సాధించి భీమ్లానాయక్ ట్రైలర్ రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ మేనియా ఏ స్థాయిలో ఉందో అందరికీ రుచిచూపించింది.

ఇక టాలీవుడ్ లో అత్యంత లైక్స్ వచ్చిన ట్రైలర్ లుగా ఇప్పటిదాకా ‘ఆర్ఆర్ఆర్’, పుష్ప ఉండేవి. 2 గంటల్లో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు 6,00,000 లైక్స్ వస్తే.. పుష్పకు 14 గంటల 28 నిమిషాల్లో 600k లైక్స్ వచ్చాయి. ఇదే 600K లైక్స్ ను తాజాగా రిలీజ్ అయిన భీమ్లా నాయక్ ట్రైలర్ కేవలం 49 నిమిషాల్లో సాధించడం విశేషం. ట్రైలర్ తో టాలీవుడ్ రికార్డులు బద్దలు కొడుతున్న పవన్.. రేపు సినిమా విడుదలైతే ఇంకెంత షేక్ చేస్తాడో చూడాలి.

నాగవంశీ నిర్మాతగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ భీమ్లానాయక్ మూవీని ‘సాగన్ కే చంద్ర’ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఫిబ్రవరి 25న రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఈరోజు ప్రీరిలీజ్ లోనే ట్రైలర్ ను లాంచ్ చేయాల్సి ఉన్నా ‘మంత్రి గౌతం రెడ్డి’ మరణంతో వాయిదాపడింది. కానీ ఫ్యాన్స్ కు ఊపు తెచ్చేలా ట్రైలర్ మాత్రం రిలీజ్ అయ్యింది. అది ఉర్రూతలూగిస్తోంది.

Bheemla Nayak Official Trailer | Pawan Kalyan, Rana Daggubati | Trivikram | SaagarKChandra | ThamanS

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Sonu Sood: ఆపద సమయంలో ఆదుకుంటూ దాన ధర్మాలు చేస్తోన్న సోనూసూద్ కి “కలియుగ కర్ణుడు” అంటూ బిరుదులు కూడా ఇచ్చారు. అయితే, తాజాగా ఈ బాలీవుడ్ నటుడు పై పంజాబ్‌లో కేసు నమోదైంది. సోనూ సూద్ సోదరి మాళవిక కాంగ్రెస్‌లో చేరి మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. […]

  2. […] Singer Parvathi: కడుపు నిండిన వాడు నాలుగు మెతుకులు పంచి పెట్టడంలో గొప్పతనం ఏమీ లేదు, కానీ.. ఖాళీ కడుపుతో కూడా ఎదుటివాళ్ళ ఆకలిని తీర్చడం నిజంగా గొప్పతనమే. కటిక పేదరికంలో కూడా ఉన్నతమైన బావాలను కలిగి ఉండటం, వాటిని నిలబెట్టుకోవడం.. నేటి ఆధునిక సమాజంలో సాధ్యం అవుతుందా ? సాధ్యం చేసి చూపించింది ఒక సాధారణ అమ్మాయి. […]

Comments are closed.

Exit mobile version