
Ram Gopal Varma Birthday: దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బర్త్ డే వేళ యంగ్ హీరోయిన్ మాసూమ్ శంకర్ సర్ప్రైజ్ చేసింది. గినీ పిగ్స్ ని ఆయనకు బహుమతిగా ఇచ్చింది. మాసూమ్ శంకర్ గిఫ్ట్ కి రామ్ గోపాల్ వర్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఎవర్ అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు. మాసూమ్ శంకర్ తో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పై నెటిజన్స్ వింత కామెంట్స్ పెడుతున్నారు. గిఫ్ట్ నీ చేతిలో(గినీ పిగ్స్) ఉన్నవా? లేక పక్కన(మాసూమ్ శంకర్) ఉన్నదా? అని ఒకరు కామెంట్ చేశారు.
కొందరేమో వాటిని వండుకు తినమాకు అని సలహా ఇస్తున్నారు. కొందరేమో కిక్ లో ఫ్రై చేసుకుని తినేస్తాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. నైనా గంగూలీ, అప్సరా రాణి, ఇనాయ సుల్తానా, అషురెడ్డి అందరూ అయిపోయారు. కొత్తగా మాసూమ్ శంకర్ ని లైన్లో పెట్టాడంటూ ఒకరు కామెంట్ చేశారు. మాసూమ్ శంకర్ తమిళ హీరోయిన్. 90 ఎంఎల్ మూవీతో ఆమె వెలుగులోకి వచ్చారు. వర్మతో ఆమెకు ఎప్పుడు ఎలా పరిచయమో తెలియదు. పరిశ్రమలో ఉన్నప్పుడు ఒకరికి మరొకరికి సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
కాగా వర్మ తన బర్త్ డే ముందు రోజు అభిమానులకు ఓ సూచన చేశాడు. పనికి మాలిన, ఉచిత జన్మదిన శుభాకాంక్షలు నాకు పంపద్దు. ఛీప్ గిఫ్ట్స్ తో అయినా నేను హ్యాపీ. ఉచిత శుభాకాంక్షల కంటే ఛీప్ గిఫ్ట్స్ చాలా బెటర్, అని ట్వీట్ చేశారు. అందుకేనేమో అభిమానులు కూడా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదు. ప్రముఖులు కూడా భయపడుతున్నారు. విష్ చేస్తే… ఎలాంటి రిప్లై ఇస్తాడో అని. వర్మ 24*7 కిక్ లో ఉంటాడు. కాబట్టి ఏ సమయంలో ఆయనకు విషెస్ చెప్పినా ప్రమాదమే. రాత్రి వేళ అయితే మరీ డేంజర్.

ఒకప్పుడు వర్మ దేశం మెచ్చిన దర్శకుడు. బాలీవుడ్ లో జెండా పాతిన సౌత్ ఇండియా దర్శకుడు వర్మ. శివ మూవీతో దర్శకుడిగా మారి ట్రెండ్ సెట్ చేశాడు. నాగార్జునకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. వర్మ ఎక్కువ కాలం అసిస్టెంట్ గా పని చేయలేదు. కేవలం తన టాలెంట్ నమ్ముకుని కథ రాసుకుని నాగార్జున వంటి హీరోని ఇంప్రెస్ చేశారు. బాలీవుడ్ లో వర్మ తెరకెక్కించిన రంగీల, సత్య, సర్కార్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి.