
Ram Charan On Virat Kohli Biopic: ఆస్కార్ అవార్డు ని గెల్చుకొని ఇండియా కి తిరిగి వచ్చిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న ఢిల్లీ లో నిర్వహించిన ‘ఇండియా టుడే కాంక్లేవ్’ మీటింగ్ లో పాల్గొన్నాడు. ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత తాను పొందిన అనుభూతి గురించి, అలాగే #RRR మూవీ చేస్తున్నప్పుడు ఆయనకీ ఎదురైనా మధుర క్షణాల గురించి రామ్ చరణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతే కాదు,ఆయన భవిష్యత్తులో చెయ్యబొయ్యే సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాను అని, ఆ సినిమా తర్వాత బుచ్చి బాబు తో ఒక సినిమా చేయబోతున్నాను అని, ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.ఈ మూవీ ఆయన కెరీర్ లో రంగస్థలం ని మించి ఉంటుందట.ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

ఇది ఇలా ఉండగా క్రికెటర్స్ లో తనకి విరాట్ కోహ్లీ అంటే బాగా ఇష్టమని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం గా ఉంటుందని, అవకాశం వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించడానికి సిద్ధం గా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా అయన డైరెక్టర్స్ కి పిలుపునిచ్చాడు. నా ముఖం కూడా కోహ్లీ కి చాలా దగ్గర పోలికలతో ఉంటుందని, బయోపిక్ కి నేను మాత్రమే న్యాయం చెయ్యగలను అంటూ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.అయితే ఒక ప్రముఖ డైరెక్టర్ తో ఈ బయోపిక్ చర్చలు రామ్ చరణ్ ఇప్పటికే జరిపాడని.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నందున చిన్న హింట్ వదిలాడు అంటూ కొన్ని కథనాలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి..మరి దీనికి కోహ్లీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది కాసేపు పక్కన పెడితే కోహ్లీ ఇటీవలే జరిగిన ఒక మ్యాచ్ లో బ్రేక్ టైం లో ‘నాటు నాటు’ పాటకి స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. #RRR మూవీ టీం ఆ వీడియో ని తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చెయ్యడం విశేషం.