Ram Charan- Oscar Awards: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ దగ్గరకు వచ్చేసింది.హాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ మరియు రాజమౌళి కనిపించబోతున్నారు అనే వార్త వింటేనే రోమాలు నిక్కపొడుస్తున్నాయి.ప్రపంచ నలుమూలల నుండి ఎంతో మంది దిగ్గజాలు పాల్గొనే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ కలిసి ‘నాటు నాటు’ పాట కి స్టెప్పులు వేయనున్నారు.
ఈ అరుదైన ఘట్టాన్ని యావత్తు సినీ లోకం వీక్షించబోతుంది.వచ్చే నెల మార్చి 12 వ తేదీన లాస్ ఏంజిల్స్ లో అట్టహాసం గా జరగబోతున్న ఈ ఈవెంట్ కి పాల్గొనేందుకు #RRR మూవీ టీం పయనమైంది.ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాస్ ఏంజిల్స్ కి ప్రయాణమయ్యాడు.ఈ సందర్భంగా ఆయన విమానాశ్రయం లోకి అడుగుపెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం స్వామిమాలలో ఉన్న రామ్ చరణ్, ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో కూడా మాలలోనే కనిపించబోతున్నాడా అని అభిమానులు సోషల్ మీడియా లో అనుకుంటూ ఉన్నారు.ఇక రామ్ చరణ్ తో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నిన్ననే బయలుదేరాల్సింది.కానీ దురదృష్టం కొద్దీ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి తారకరత్న చనిపోవడం తో ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది.కానీ ఆస్కార్ అవార్డ్స్ కి మాత్రం ఎన్టీఆర్ కచ్చితంగా హాజరు అవుతాడట.కానీ ఎప్పుడు బయలుదేరుతాడు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ శనివారం వరకు ఆగాల్సిందే.ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డుని అందుకున్న #RRR చిత్రం, ఆస్కార్ అవార్డు ని కూడా అందుకొని మన ఇండియన్ సినిమా ఖ్యాతి గురించి మరోసారి ప్రపంచం మొత్తం మాట్లాడుకునే చెయ్యాలని మన అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.