Ram Charan- Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 16 వ చిత్రాన్ని ముందుగా జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసాడు..కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ రద్దు అయ్యింది..ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని గౌతమ్ తిన్ననూరి సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకున్నాడు.

మరి రామ్ చరణ్ తన 16 వ చిత్రాన్ని ఎవరితో చెయ్యబోతున్నాడు అని అభిమానులు అనుకుంటున్న సమయం లో ఈరోజు ఆయన 16 వ చిత్రం గురించి అధికారిక ప్రకటన జరిగింది..ఉప్పెన వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసిన బుచ్చి బాబు తో రామ్ చరణ్ 16 వ సినిమా చెయ్యబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు..ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ ని అందించాడు..ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయం లో చిన్న అయ్యోమయ్యం ఏర్పడింది.
కథ బ్యాక్ డ్రాప్ రీత్యా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహ్మాన్ ఉంటె బాగుంటుందని సుకుమార్ అభిప్రాయం..కానీ దేవి శ్రీ ప్రసాద్ కూడా లైన్ లో ఉన్నాడు..వీళ్ళిద్దరిలో ఎవరిని తేల్చాలో తెలియక ప్రస్తుతానికి మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎలాంటి ప్రకటన చెయ్యలేదు..ఇక ఈ సినిమా కథ మొత్తం శ్రీకాకుళం రూరల్ బ్యాక్ డ్రాప్ లో నాటు మాస్ గా ఉంటుందని చెప్తున్నారు..ఇందులో రామ్ చరణ్ కబ్బడి ఆటగాడిగా నటించనున్నాడు..రామ్ చరణ్ పాత్ర మరియు సినిమా కంటెంట్ రంగస్థలం రేంజ్ లో ఉంటుందని సమాచారం..ఇదే కనుక జరిగితే రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టించబోతున్నాడనే చెప్పాలి.

ప్రస్తుతం రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా 2024 వ సంవత్సరం లో విడుదల కానుంది..ఇక రామ్ చరణ్ – బుచ్చి బాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది..అంటే శంకర్ సినిమాకంటే ముందుగా ఈ సినిమానే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.