Bigg Boss 6 Telugu- Faima vs Revanth: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ చాలా హీట్ వాతావరణం మధ్య జరిగింది..ముఖ్యంగా ఆది రెడ్డి మరియు ఫైమా రేవంత్ ని టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టడం తో వీళ్ళ ముగ్గురు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి..ముందుగా ఫైమా రేవంత్ ని నామినెటే చేస్తుంది..అప్పుడు వీళ్లిద్దరి మధ్య వాదనలు చోటు చేసుకుంటూ చర్చ జరుగుతున్న సమయం లో రేవంత్ మాట్లాడుతూ ‘సపోర్టు తీసుకోకుండా ఒక్క ఆట కూడా ఆడలేని నువ్వు నన్ను అంటున్నావా’ అని అంటాడు.

అప్పుడు ఫైమా ‘నువ్వు సపోర్టు తీసుకోకుండా ఆడావా’ అంటుంది..’నేను ఆడింది లేదో నువ్వు చూసావా’ అంటాడు రేవంత్..అప్పుడు ఫైమా రెచ్చిపోయి ‘నువ్వు చేసావా నేను సపోర్టు తీసుకొని ఆడినట్టు’ అని రేవంత్ వైపు కోపంగా వేలు చూపిస్తూ మాట్లాడుతుంది..’వేలు చూపించకు’ అంటూ రేవంత్ బిగ్గరగా అరుస్తూ ఫైమా మీదకి వెళ్తాడు..అలా వీళ్లిద్దరి మధ్య చాలా హీట్ వాతావరణం లో గొడవలు జరుగుతుంది.
ఇక ఆ తర్వాత ఆమె కెమెరా వైపు చూస్తూ జనాలతో మాట్లాడుతూ ‘రేవంత్ పూటకి ఒక మాట మారుస్తూ ఉండేది ఎవరికీ కనిపించడం లేదా..ఎలా ఓట్లు ఇస్తున్నారు అతనికి..ముందు ఒక మాట మాట్లాడుతాడు వెనుక ఒక మాట మాట్లాడుతాడు..ముందు నుండి అతను నోరు జారుతూనే వస్తున్నాడు..అవన్నీ ఎవరికీ కనిపించడం లేదా..ఇక్కడేమో కీర్తి సూపర్ గా ఆడావు అంటాడు..వెనుక చేరి కీర్తి అసలు ఏమి ఆడలేదు అంటాడు..అసలు ఇవన్నీ ఎవరు చూడడం లేదా..చూపించడం లేదా టీవీ లో’ అని ఆమె చెలరేగిపోతుంది.

ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈరోజు జరగబొయ్యే ఎపిసోడ్ లో చూడాలి..ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయినా ఇంటి సభ్యులు రేవంత్, ఫైమా , శ్రీ సత్య , ఆది రెడ్డి, కీర్తి, రోహిత్..వీరిలో ఎవరు అతి తక్కువ ఓట్లతో ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళబోతున్నారు అనేది చూడాలి.