
Photo Story: సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రెటీలు తమ చిన్నప్పటి ఫొటోలతో సందడి చేస్తున్నారు. వారి బర్త్ డే, ఇతర కార్యక్రమాల సందర్భంగా ఆ పిక్స్ ను బయట పెడుతున్నారు. ఈ ఫొటోలతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. లేటేస్టుగా ఇద్దరు చిన్నారులు కలిసున్న ఓ ఫొటో సందడి చేస్తోంది. ఓ అబ్బాయి భజంపై మరో చిన్నారి చేతులు వేసి ఇద్దరు స్మెల్ చేస్తున్నారు. వీరిలో ఒకరిని చూస్తే ఇప్పటి స్టార్ హీరో గుర్తుకొస్తున్నారు. మరొకరు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు పొందారు. మెగా కాంపౌండ్ కు చెందిన ఈ ఫొటో ను చూస్తే కచ్చితంగా ఆ హీరోలు ఎవరో గుర్తుపడుతారు. గుర్తుపట్టకపోతే కిందికి వెళ్లండి..
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది నటులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఉన్నారు. రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ వరల్డ్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అస్కార్ అవార్డు తెచ్చుకోవడంతో రామ్ చరన్ ఫుల్ ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఆయన సౌత్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఎడమ సైడ్ ఉన్న మరో చిన్నారి సాయిధరమ్ తేజ్. ‘పిల్లా నువ్వులేని జీవితం’ అనే డెబ్యూ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా యావరేజ్ సక్సెస్ సాధించడంతో ఈ యంగ్ హీరోకు మొదటి సినిమాతోనే గుర్తింపు వచ్చింది. ఆ తరువాత పలు సినిమాలలో నటించినా అవి సక్సెస్ కాలేదు. అయితే సాయి ధరమ్ తేజ్ స్టార్ అయ్యారు. గతంలో ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. మళ్లీ కోలుకొని ‘విరూపాక్ష’ సినిమాలో నటించారు. ఆ మూవీ ఏప్రిల్ 21న రిలీజ్ అయింది.

చిన్నప్పుడు మెగా ఫ్యామిలీకి చెందిన కుర్రాళ్లు అంతా అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఓ సందర్భంలో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ కలుసుకొని దిగిన ఫొటో ఇది. ఈ ఫిక్ ఇప్పుడు బయటపెట్టారు. అయితే సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ రిలీజ్ సందర్భంగా దీనిని సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది. ఈ పిక్ తో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.