
Ram Charan And NTR: ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ కష్టం అంతా ఇంతా కాదు. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ నెలల తరబడి షూట్ చేశారు. సెట్స్ లో దర్శకుడు రాజమౌళి నటులతో ఆడుకున్నాడు. ఒకటికి పది సార్లు చేయించి వాళ్ళను నార తీశారు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ఇంట్రో సీన్స్ కోసం బాగా కష్టపడాల్సి వచ్చింది. చరణ్ అయితే వందల మంది మధ్య ఒక్కడే పోరాడాడు. ఈ ఎపిసోడ్ షూట్ సమయంలో చరణ్ పేరెంట్స్ చిరంజీవి, సురేఖ సెట్స్ కి వెళ్లారట. జనాల మధ్యలో నుండి చరణ్ ని నేలపై ఈడ్చుకు వెళుతుంటే అమ్మానాన్నలకు ఏడుపు వచ్చేసిందట.
ఇక ఆస్కార్ బరిలో నిలిచిన నాటు నాటు సాంగ్ సైతం ఆర్ ఆర్ ఆర్ హీరోలకు చుక్కలు చూపించింది. ఉక్రెయిన్ దేశంలో 15 రోజులు షూట్ చేశారు. ఒక్క పాటకు 15 రోజులు అంటే ఇక రాజమౌళి డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. షూట్ కి ముందు వారం రోజులు ప్రాక్టీస్ సెషన్స్ జరిగిపారు. ఇక ఎన్టీఆర్, చరణ్ మూమెంట్స్ ఖచ్చితంగా సింక్ అవ్వాలని రాజమౌళి నియమం పెట్టాడు. ఆ కారణంగా వారిద్దరికీ దేవుడు కనిపించాడు.
ఏ ఇద్దరి వ్యక్తుల బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉండదు. వంద శాతం సింక్ కాదని చెప్పినా రాజమౌళి వినేవాడు కాదట. నాకు ఇలానే కావాలంటూ పట్టుబట్టేవాడట. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ కంపోజ్ చేశారు. టీమ్ కృషి ఫలించింది. వారి కష్టానికి ఫలితం దక్కింది. నాటు నాటు ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ హీరోలుగా నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ విశిష్ట గౌరవం అందుకుంటున్నారు.

మరికొన్ని గంటల్లో ఆస్కార్ ఫలితాలు రానున్నాయి. ఆల్రెడీ లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ ఈవెంట్ మొదలైంది. ఇక ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ సిద్ధమయ్యారు. లక్షలు ఖర్చుపెట్టి కోట్లు, సూట్లు ఏర్పాటు చేసుకున్నారు. లాస్ ఏంజెల్స్ నగరంలో ఆర్ ఆర్ ఆర్ హీరోలపై చేసిన ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి. మళ్ళీ మళ్ళీ రాని అరుదైన అవకాశం కావడంతో ప్రపంచం దృష్టిలో పడేందుకు అనుగుణంగా అన్ని విధాలా సిద్ధమయ్యారు. డిజైనర్ సూట్స్ కోసం ఎన్టీఆర్, చరణ్ బాగానే ఖర్చు చేశారు. రామ్ చరణ్ ఒక్కో సూట్ ధర రూ. 17 లక్షల వరకూ ఉంటుందని ఇటీవల ఓ వార్త తెరపైకి వచ్చింది.
