
Photo Story: మీరు చూస్తున్న ఈ ఫొటోలో ఒక హీరోయిన్ ఉన్నారు. ఈ ఇద్దరు చిచ్చర పిడుగుల్లో ఒకరు సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్. ఆమె ఎవరో ఇప్పటికే మీకు తట్టి ఉంటుంది. సదరు హీరోయిన్ ఎవరో కాదు కీర్తి సురేష్. ఈ ఫోటో కీర్తి సురేష్, రేవతి సురేష్ లది. చిన్న పాప కీర్తి అన్నమాట. అక్క రేవతి బర్త్ డే సందర్భంగా కీర్తి సురేష్ కొన్ని అరుదైన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రియమైన అక్కకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అయ్యింది. దీంతో కీర్తి అభిమానులు ఆమె సిస్టర్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
కీర్తి సురేష్ పేరెంట్స్ పరిశ్రమకు చెందినవారే. నాన్న సురేష్ దర్శకుడు కాగా అమ్మ మేనక ఒకప్పటి టాప్ హీరోయిన్. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన పున్నమినాగు మూవీలో కీర్తి తల్లి నటించారు. ఆమె అధికంగా మలయాళ, తమిళ చిత్రాలు చేశారు. మేనకకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి రేవతి సురేష్, చిన్నమ్మాయి కీర్తి సురేష్. రేవతి నటనకు దూరంగా ఉన్నారు. కీర్తి మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ అయ్యారు.
రేవతికి 2016లో నితిన్ మోహన్ అనే వ్యక్తితో వివాహమైంది. రేవతి గురించి తెలిసింది తక్కువే. ఈమె సోషల్ మీడియా అకౌంట్స్ కూడా వాడరు. కీర్తి మాత్రం తల్లి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 2013లో విడుదలైన గీతాంజలి అనే మలయాళ చిత్రంతో కీర్తి హీరోయిన్ అయ్యారు. రామ్ పోతినేని హీరోగా విడుదలైన నేను శైలజ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు.

కీర్తికి మహానటి చిత్రం బ్రేక్ ఇచ్చింది. ఎందరి వద్దకో వెళ్లిన ఈ సబ్జెక్టు కీర్తి సురేష్ వద్ద ఆగింది. ఆమె చేయాలని రాసి పెట్టి ఉందేమో కానీ దర్శకుడు నాగ అశ్విన్ మహానటి స్క్రిప్ట్ తో ఆమె వద్దకు వచ్చాడు. చెప్పాలంటే నాగ అశ్విన్ కి అప్పటికి పెద్దగా ఫేమ్ లేదు. అందుకే సావిత్రి బయోపిక్ వంటి క్రేజీ ప్రాజెక్ట్ అయినప్పటికీ పలువురు హీరోయిన్స్ ఆసక్తి చూపలేదు. కీర్తి సురేష్ కెరీర్ కి భయంకరమైన మైలేజ్ ఇచ్చింది మహానటి చిత్రం.
మహానటితో కీర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. అదే సమయంలో స్టార్ హీరోల ఛాయిస్ అయ్యారు. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ కి జంటగా నటించిన సర్కారు వారి పాట సూపర్ హిట్ కొట్టింది. ఆ చిత్రంలో కీర్తి నెగిటివ్ షేడ్స్ తో కూడిన రొమాంటిక్ రోల్ చేశారు. ఆ పాత్రలోని షేడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ప్రస్తుతం ఆమె దసరా, భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు. నాని హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దసరా మార్చి 30న విడుదల అవుతుంది. భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర చేస్తున్నారు.
