Pawan Kalyan Janasena party : ఏపీలో వచ్చే ఎన్నికలకు గోదావరి ట్రెండ్ సెట్ చేసింది. వచ్చే ఎన్నికల స్వరూపం ఎలా ఉండబోతున్నాయో గోదావరి పరిణామాలు చాటి చెబుతున్నాయి. సామాజిక పరివర్తన గోదావరి జిల్లాల్లో వచ్చింది. గోదావరి జిల్లాలే ఇప్పుడు రోల్ మోడల్ గా నిలిచాయి.
గత ఎన్నికల్లో గోదావరి పరివాహక జిల్లాల వారు గంపగుత్తగా వైసీపీకి ఓటు వేశారు. ఈసారి ఇది మార్పునకు లోనవుతోంది. కొత్త ప్రయోగం చేస్తోంది. సోషల్ ఇంజినీరింగ్ కు అంకురార్పణ జరిగింది. కాపులు, శెట్టి బలిజలు, మత్స్యకారులు కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడ్డారు. సామాజిక సంఘటనగా ఒక కూర్పుకు ఆజ్యం పోసింది గోదావరి జిల్లా. దీనికి దళిత గొంతుక మహాసేన రాజేశ్ ఆ జట్టులో కలవడం మరింత బలాన్ని ఇచ్చినట్టైంది.
దీని అర్థం ఏంటంటే.. బహుజనులు అందరూ కలిసి ఓ సామాజిక కూర్పు మోడల్ ను గోదావరి జిల్లాల్లో ఆవిష్కరించారు. సామాజిక సమాఖ్యలో ఇప్పుడు కాపులు, బీసీలు, దళితులు అందరూ కలిసి ఏకమవ్వడం జనసేనకు అండగా నిలబడడం రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
గోదావరి మోడల్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తే.. గోదావరి మోడల్ రాష్ట్ర మోడల్ అయితే జనసేనకు ఎంతో ఉపయోగం.. ఈ మోడల్ పై సాధ్యాసాధ్యాల విషయంలో ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.