https://oktelugu.com/

తొలి అనుభవం.. రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర కామెంట్స్

యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఉండటం రకుల్ ప్రీత్ సింగ్ కు బాగా కలిసొచ్చింది. గ్లామర్ షోకు రకుల్ ఏమాత్రం అడ్డు చెప్పకపోవడంతో హిట్టు.. ప్లాపులతో సంబంధం లేకుండా ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. Also Read: రివ్యూ: ‘ఆకాశం నీ హద్దురా’ హిట్టా? ఫ్లాపా? కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులన్నీ వాయిదా పడిన సంగతి తెల్సిందే. తాజాగా రకుల్ ప్రీత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 12:01 PM IST
    Follow us on

    యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఉండటం రకుల్ ప్రీత్ సింగ్ కు బాగా కలిసొచ్చింది. గ్లామర్ షోకు రకుల్ ఏమాత్రం అడ్డు చెప్పకపోవడంతో హిట్టు.. ప్లాపులతో సంబంధం లేకుండా ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి.

    Also Read: రివ్యూ: ‘ఆకాశం నీ హద్దురా’ హిట్టా? ఫ్లాపా?

    కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులన్నీ వాయిదా పడిన సంగతి తెల్సిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సినిమా షూటింగులో పాల్గొంది. ఈమేరకు ఆమె తన సినిమా అనుభవం.. తొలిరోజు షూటింగ్ ఎలా జరిగిందనే విషయాన్ని తాజాగా వెల్లడించింది. ఢిల్లీకి చెందిన రకుల్ ప్రీత్ సింగ్ డిగ్రీ చదువుతుండగానే కన్నడ సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలిపింది.

    షూటింగుకు ఒక్కరోజు ముందుగానే తాను అక్కడికి వెళ్లినట్లు చెప్పింది. ఎలాంటి రిహార్సల్ లేకుండానే తొలిరోజు షూటింగులో పాల్గొన్నట్లు తెలిపింది. ‘హీరో బైక్ పై ఉన్నాడు.. నేను వెనుక నుంచి నడుస్తుంటాను.. అతడు నా వైపు సీరియస్ గా చూసి నన్ను ఫాలో అవ్వద్దు అంటాడు.. నేను మళ్లీ వెనక్కి వచ్చేయాలి’ ఇది తన సీన్ అని చెప్పింది. ఈ సీన్ దర్శకుడు చెప్పినట్లు చేయగానే యూనిట్లోని వారంతా మెచ్చుకున్నారని మురిసిపోయింది.

    Also Read: మహేష్ బాబు ఎంజాయ్.. మామూలుగా లేదుగా..!

    టాలీవుడ్లో కంటే ముందుగా తనకు హిందీ సినిమా ఆఫర్ వచ్చిందని.. అయితే తెలుగు సినిమా ముందు రిలీజ్ కావడంతో టాలీవుడ్ నుంచి అవకాశాలు ఎక్కువగా వచ్చాయని తెలిపింది. ఆ తర్వాత హిందీ సినిమా అవకాశాలు వచ్చిన టాలీవుడ్ సినిమాల వల్ల వాటికి దూరమయ్యానని తెలిపింది. తెలుగు ప్రేక్షకుల తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలతో టాలీవుడ్ సినిమాలకే పెద్దపీఠ వేసినట్లు రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్