తిరుమల దేవస్థానానికి వచ్చే సంపదను బయట వినియోగించకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించాలని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సంపదను ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. రాష్ట్రంలోని పాలకులకు కనువిప్పు కలగాలని స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు.