
Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు దూరమైపోయారు. ఇకపై ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు కష్టమే. వరుస పరాజయాల నేపథ్యంలో మేకర్స్ ఆమెను పక్కన పెట్టేసిన సూచనలు కనిపిస్తున్నాయి. 2021లో రకుల్ రెండు చిత్రాలు చేశారు. నితిన్ కి జంటగా చెక్, వైష్ణవ్ తేజ్ తో ప్రయోగాత్మక చిత్రం కొండపొలం చిత్రాల్లో నటించారు. ఇవి రెండూ డిజాస్టర్ అయ్యాయి. టాలెంటెడ్ డైరెక్టర్స్ గా పేరున్న చంద్రశేఖర్ ఏలేటి, క్రిష్ ఆమెకు హిట్ ఇవ్వలేకపోయారు. రకుల్ చేతిలో ఒక్క తెలుగు చిత్రం కూడా లేదు.

అయితే ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీద పెట్టింది. అక్కడ వరుస చిత్రాలు చేస్తున్నారు. 2022లో ఏకంగా ఐదు సినిమాలు విడుదల చేశారు. అటాక్, రన్ వే 34, కట్ఫుట్లీ, డాక్టర్ జీ, థాంక్ గాడ్ చిత్రాల్లో రకుల్ హీరోయిన్ గా నటించారు. బ్యాడ్ లక్… ఒక్కటి కూడా విజయం సాధించలేదు. రకుల్ కి గత ఏడాది కలిసి రాలేదనే చెప్పాలి. అయితే 2023 ఆరంభంలోనే విజయం అందుకున్నారు. ఆమె లేటెస్ట్ రిలీజ్ ఛత్రీవాలి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఛత్రీవాలి బోల్డ్ కాన్సెప్ట్ తో సోషల్ మెసేజ్ మూవీగా తెరకెక్కింది. రకుల్ కండోమ్ టెస్టర్ రోల్ చేశారు. జీ5 లో నేరుగా విడుదలైన ఛత్రీవాలి చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం రకుల్ రెండు తమిళ్, ఒక హిందీ చిత్రం చేస్తున్నారు. కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు 2లో నటిస్తున్నారు. అలాగే శివ కార్తికేయన్ కి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు.
మరోవైపు పెళ్లి పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం రకుల్ తన ప్రియుడ్ని పరిచయం చేసింది. నిర్మాత, నటుడు జాకీ బగ్నాని ని ప్రేమిస్తున్నట్లు తెలియజేశారు. గత ఏడాదే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కాల్సిందట. రకుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో కుదరలేదట. ఈ ఏడాది కచ్చితంగా రకుల్ వివాహం చేసుకుంటారన్న వాదన వినిపిస్తోంది.

కాగా రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ తో ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. టైట్ చోళీ ధరించి యద అందాల విందు చేసింది. సాంప్రదాయ కట్టులో కూడా రకుల్ గ్లామర్ యాంగిల్ వదల్లేదు. రకుల్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ జీరో సైజ్ బేబీ కుర్రకారుకు గిలిగింతలు పెడుతుంటే క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.