Homeఆంధ్రప్రదేశ్‌Pathivada Narayanaswamy Naidu: ఆ వృద్ధ నేతకు క్షోభపెట్టిన చంద్రబాబు..

Pathivada Narayanaswamy Naidu: ఆ వృద్ధ నేతకు క్షోభపెట్టిన చంద్రబాబు..

Pathivada Narayanaswamy Naidu
Pathivada Narayanaswamy Naidu

Pathivada Narayanaswamy Naidu: చంద్రబాబు రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేర్కొంటారు. వ్యూహాలు రూపొందించడంలో దిట్ట అంటారు. ఆయన రాజకీయాల్లో రాణించడానికి అవే కారణమని చెబుతుంటారు. అందులో వాస్తవముండొచ్చు.. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలావరకూ ప్రతికూల ఫలితాలనిచ్చాయి. రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 2004 ముందస్తు ఎన్నికలకు వెళ్లి .. తాను దెబ్బతినడమే కాకుండా.. అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రభుత్వానికి సైతం ముందస్తుకు తీసుకెళ్లి అపార నష్టం కలిగించారు. ఇప్పటికీ ఈ నిర్ణయంపై చంద్రబాబు చింతిస్తుంటారు. అయితే చంద్రబాబులో ఒక ప్రతికూల అంశం ఒకటి ఉంది. మొహమాటాలకు పోయి నిర్ణయాలను జాప్యం చేస్తుంటారన్న అపవాదు ఆయనపై ఉంది. అయితే ఇప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీ వర్గాలనే విస్మయపరచినట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి బాధ్యతల నుంచి రాజకీయ కరువృద్ధుడు పతివాడ నారాయణస్వామినాయుడుని తప్పించారు. కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా తప్పించడంపై ఆ వృద్ధ నేత మనస్తాపం చెందారు. అధినేత తీరుపై కీనుక వహించారు.

Also Read: KCR Assembly: కాంగ్రెస్‌కు కేసీఆర్‌ స్నేహ హస్తం.. అసెంబ్లీ ప్రసంగంలో వెనుక పెద్ద కథ!

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్న నేతల్లో పతివాడ నారాయణస్వామినాయుడు సీనియర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. ఒకరకంగా చంద్రబాబు కంటే ఆయనే సీనియర్. పూర్వపు భోగాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983 నుంచి 2009 వరకూ ఆరుసార్లు వరుసగా గెలుపొందూ వస్తున్నారు.ఒకసారి మంత్రిగా కూడా వ్యవహరించారు. lనియోజకవర్గాల పునర్విభజనతో భోగాపురం నియోజకవర్గం నెల్లిమర్లగా మారింది. 2009లో అక్కడ నుంచి పోటీచేసిన పతివాడ తొలిసారిగా ఓడిపోయారు. కానీ 2014లో మాత్రం గెలుపొందారు. శాసనసభలో సీనియర్ గా గుర్తింపుపొందారు. ప్రొటెం స్పీకర్ గా కూడా వ్యవహరించారు. వయోభారంతో బాధపడుతున్నా చంద్రబాబు 2019లో మరోసారి నెల్లిమర్ల టిక్కెట్ కట్టబెట్టారు. కానీ ఓటమే ఎదురైంది. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజుకు అప్పగించారు.

Pathivada Narayanaswamy Naidu
Pathivada Narayanaswamy Naidu

గత కొంతకాలంగా నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు వేరొకరికి అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. దీనిపై హైకమాండ్ అన్నివిధాలా సర్వేచేసి అర్ధబలం, అంగబలం ఉన్న నేతగా బంగార్రాజును గుర్తించింది. కానీ వృద్ధ నేత పతివాడ నారాయణస్వామినాయుడు అభిప్రాయాన్ని తెలుసుకోలేదు సరికదా.. ఆయనకు మాట మాత్రంగానైనా చెప్పకుండా నియోజకవర్గ ఇన్ చార్జి పదవి నుంచి తప్పించింది. బంగార్రాజును నియమించింది. దీంతో పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని వృద్ధ నేత జీర్ణించుకోలేకపోతున్నారుట. కనీసం ఒక్క మాట అయినా చెప్పి ఉన్నా బాగున్నుకదా అని నొచ్చుకున్నారుట. ఏకంగా విలేఖర్ల సమావేశం పెట్టి మరీ తన ఆవేదనను వెలిబుచ్చారు. దీంతో పార్టీ హైకమాండ్ అలెర్ట్ అయ్యింది. చంద్రబాబు వృద్ధ నేతను పిలిపించుకొని మాట్లాడారు. బుజ్జగించే ప్రయత్నం చేశారు. అప్పట్లో నిర్ణయాల్లో జాప్యం చేశారు. ఇప్పుడు తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబుపై పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: Drug Cases In Kerala: స్కూల్ డెస్క్ లు, బ్యాగ్ లలో డ్రగ్స్.. ప్రగతి శీల రాష్ట్రంలో ఉడ్తా పంజాబ్

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular