Pawan Kalyan’s #OG : పవన్ కళ్యాణ్ #OG లో మరో స్టార్ హీరో.. సుజిత్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Pawan Kalyan’s #OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అనే ప్రకటన రాగానే సోషల్ మీడియా ఎలా ఊగిపోయిందో మన అందరం చూసాం..సెలెబ్రిటీలు సైతం ఈ ప్రాజెక్ట్ పై ఎంతో ఆత్రుతని చూపించారు.. అందులో రామ్ చరణ్ – ప్రభాస్ వంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోబోతున్న ఈ సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్ లోని […]

Written By: NARESH, Updated On : January 30, 2023 7:17 pm
Follow us on

Pawan Kalyan’s #OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అనే ప్రకటన రాగానే సోషల్ మీడియా ఎలా ఊగిపోయిందో మన అందరం చూసాం..సెలెబ్రిటీలు సైతం ఈ ప్రాజెక్ట్ పై ఎంతో ఆత్రుతని చూపించారు.. అందులో రామ్ చరణ్ – ప్రభాస్ వంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోబోతున్న ఈ సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ సుజిత్ కి స్క్రిప్ట్ బుక్ చేతికి ఇవ్వగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేసాడు.. ఆ తర్వాత నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా ముహూర్తపు సన్నివేశాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ సుజిత్.. రెగ్యులర్ షూటింగ్ గురించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా కాస్టింగ్ కూడా భారీగానే ఉండబోతుందట.. కన్నడలో స్టార్ హీరోగా యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న రక్షిత్ శెట్టి ఇందులో ఒక కీలక పాత్ర ని పోషిస్తున్నట్టు తెలుస్తోంది.. అంతే కాదు కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన అనుపమ్ ఖేర్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.. వీరితో పాటుగా బాలీవుడ్ నటి టబు కూడా ఈ చిత్రంలో నటిస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ సినిమాలకు అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ అందించిన థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు.. వాస్తవానికి తొలుత ఈ సినిమా కోసం అనిరుథ్ ని తీసుకోవాలని అనుకున్నాడు.. కానీ ప్రస్తుతం అనిరుథ్ చేతిలో 10 సినిమాలు ఉన్నాయి.. బాగా సమయం పడుతుంది అని చెప్పడంతో థమన్ ని తీసుకున్నారట.