సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య సమస్యలతో ఇటీవల అమెరికా వెళ్లడంతో అభిమానులు ఆందోళన పడటం, ఆ తర్వాత రజిని సన్నిహితులు కేవలం వైద్య పరీక్షల కోసమే రజిని అమెరికా వెళ్లారని, అంతకు మించి ఎలాంటి భయపడే ప్రమాదం ఏమి లేదు అని, అభిమానులు అందరూ ఎలాంటి ఆందోళన చెందొద్దు అని ఫ్యాన్స్ కు సందేశాలు పంపారు.
అయితే, ఆ తర్వాత రజిని ఆరోగ్యం పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దాంతో రజనీ ఆరోగ్యం విషయమై కొందరి అభిమానుల్లో టెన్షన్ రోజురోజుకు ఎక్కువవుతూ ఉంది. కొంతమంది అభిమానులు, మిత్రులు రజినికి ఏమైంది అంటూ కుటుంబ సభ్యులకు తీవ్రంగా ఫోన్లు చేసి విసిగిస్తున్నారట. ఇదంతా గమనించిన రజిని తానే స్వయంగా రంగంలోకి దిగారు.

ముఖ్యంగా తన ఫ్యాన్స్ కి టెన్షన్ అక్కర్లేదు అనే విషయాన్ని సూపర్ స్టార్ రెండు ఫొటోలతో పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ రెండు ఫొటోల్లో ఒకటి అమెరికాలోని తన కుమార్తె ఐశ్వర్యా ధనుష్ తో కలిసి రజనీ నడుచుకుంటూ వస్తున్న ఫొటో ఒకటి కాగా, లోకల్ ట్రైన్ లో రజిని గాగుల్స్ పెట్టుకుని, ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తోన్న ఫొటో ఒకటి. మొత్తానికి తన అభిమానుల కోసం రజిని ఈ రెండు ఫోటోలు దిగారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ రెండు ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు రజనీ ఆరోగ్యం పట్ల పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నట్టు రజిని ఇండియాకు ఎప్పుడు వస్తారు అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు. అయితే, రజిని కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. అంటే మరో రెండు వారాల పాటు సూపర్ స్టార్ అమెరికాలోనే ఉండనున్నారు. జూలై 8కి ఇండియా వస్తారని తెలుస్తోంది.