Rajinikanth First Love: ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు..వాటికి ఉదాహరణలు ఎన్నో మనం చూసాము..సూపర్ స్టార్ రజినీకాంత్ జీవితం కూడా ఆ ఉదాహరణకు ఒక ప్రతిరూపం లాంటిది..బస్సు కండక్టర్ గా జీవితం ని ప్రారంభించిన ఆయన నేడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే నెంబర్ 1 సూపర్ స్టార్ గా ఎదిగి, విదేశాలలో కూడా అభిమానులను సొంతం చేసుకోవడం అంటే ఆయనలోని ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..అయితే ప్రారంభంలో ఆ టాలెంట్ ని ఎవరో ఒకరు గుర్తించాల్సిందే..అలా రజినీకాంత్ టాలెంట్ ని మొట్టమొదట గుర్తించింది ఆయన ప్రేయసి..ఆమె లేకపోతే ఈరోజు రజినీకాంత్ బస్సు కండక్టర్ గానే ఉండిపోయేవాడు ఏమో.

తాను ఇంతటి వాడిగా ఎదగడానికి కారణమైన ఆ అమ్మాయి అకస్మాత్తుగా మాయం అయిపోయింది..ఆరోజు నుండి నేటి వరుకు రజినీకాంత్ ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు..రజినీకాంత్ జీవితం లోకి దేవతలాగా ప్రవేశించి మాయమైపోయిన ఆ ఆదృశ్యదేవత ఎవరు..బస్సు కండక్టర్ గా జీవితాన్ని కొనసాగిస్తున్న రజినీకాంత్ సినిమాల వైపుకి ఆమె అడుగులు వేయించేలా ఏమి చేసింది అనేదే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
రజినీకాంత్ బస్సు కండక్టర్ గా పనిచేస్తున్న కాలం లో ప్రతీ రోజు ఒక అమ్మాయి బస్సు ఎక్కుతూ ఉండేది..అలా వీళ్లిద్దరి మధ్య కొన్ని అనుకోని సంఘటనల వల్ల పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది..రజినీకాంత్ ఒకపక్క బస్సు కండక్టర్ గా పని చేస్తూనే మరోపక్క నాటకాలు కూడా వేసేవాడు..ఒకరోజు తాను ముఖ్య పాత్ర పోషిస్తున్న నాటకానికి ఆమెని ఆహ్వానించాడు రజినీకాంత్..ఆ తర్వాత అక్కడకి వచ్చి ఆ నాటకం మొత్తాన్ని చూసిన ఆ అమ్మాయి ఆశ్చర్యానికి గురైంది..రజినీకాంత్ లో ఇంత టాలెంట్ ఉంది అది వృథా అవ్వకూడదని ఆమె అనుకుంది.
వెంటనే ఆయనకీ తెలియకుండా ఫిల్మ్ ఇంస్టిట్యూట్ కి అప్లై చేసింది..కొన్ని రోజుల తర్వాత రజినీకాంత్ కి అడయార్ ఫిల్మ్ ఇంస్టిట్యూట్ నుండి ఒక లెటర్ వచ్చింది..వెంటనే ఇంస్టిట్యూట్ కి రావాల్సింది గా ఆ ఉత్తరం సారాంశం..ఒక రోజు ఆ అమ్మాయిని రజినీకాంత్ ని కలవగా ‘లెటర్ వచ్చిందా’ అని అడిగింది అట..అప్పుడు రజినీకాంత్ ‘నీకెలా తెలుసు ఇది..నువ్వే అప్లై చేసావా’ అని అడుగుతాడు..ఆమె ‘అవును..నేనే చేశాను’ అని చెప్తుంది..అప్పుడు రజినీకాంత్ నాకు కూడా చేరాలనే ఉంది..కానీ అక్కడ ఉండడానికి చాలా డబ్బులు అవసరం అవుతుంది..నా దగ్గర అంత డబ్బులు లేవు అని రజినీకాంత్ సమాధానం ఇచ్చాడట.

అప్పుడు ఆమె తన దగ్గరున్న 500 రూపాయిలను రజినీకాంత్ చేతిలో పెట్టి, వెంటనే వెళ్లి జాయిన్ అవ్వు..నీలో అనితరసాధ్యమైన టాలెంట్ ఉంది,ఎదో ఒకరోజు నువ్వు పెద్ద సూపర్ స్టార్ అవుతావు..దేశం గర్వించదగే నటుడువి అవుతావు అని చెప్పి అతనిని ప్రోత్సహించి సినిమాల్లోకి వెళ్లేలా చేసింది..ఫిల్మ్ ఇంస్టిట్యూట్ లో చేరిన తర్వాత కొన్ని రోజులకు ఆ అమ్మాయిని కలవడానికి వస్తే ఆమె ఆచూకీ తెలియలేదు.
కష్టపడి చివరికి ఆమె ఇంటి అడ్రస్ ని సంపాదించి ఆమె ఇంటికి వెళ్లగా తలుపులకు తాళం వేసి ఉంటుంది..చుట్టుపక్కన ఉన్నవాళ్ళని అడగగా ఆమె వారం క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్తారు..అప్పటి నుండి ఇప్పటి వరుకు రజినీకాంత్ ఆమె కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.