Sanju Samsun: పరిహాసం కాస్త నవ్వులపాలైంది. కెప్టెన్ ఆగ్రహానికి కారణమైంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ పై ఇప్పుడు ట్రోలర్స్ కామెంట్లతో గోలగోల చేస్తున్నారు. ఐపీఎల్ సందడి మొదలుకావడంతో టీం మేనేజ్ మెంట్ లు ప్రేక్షకులను అలరించేందుకు జట్టు విశేషాలు పంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ చేసిన చిలిపి పని నవ్వులపాలైంది. కెప్టెన్ సంజూ శాంసన్ పైనే రాజస్థాన్ రాయల్స్ టీం సెటైర్ వేసింది. దీనికి సీరియస్ అయిన శాంసన్ ఏకంగా సోషల్ మీడియాలోనే క్లాస్ పీకాడు. దీంతో తప్పు గ్రహించిన రాజస్థాన్ రాయల్స్ టీం ట్విట్టర్ పెట్టిన ఓ ఫొటోను తీసేయాల్సి వచ్చింది. ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది.

ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో తాజాగా ఒక ఫొటో షేర్ చేసింది. వారి స్వంత ఆటగాళ్లతో పాటు ఇతర ఫ్రాంచైజీల ఆటగాళ్లపై సెటైర్ వేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. కెప్టెన్ సంజూ శాంసన్ బస్ లో ప్రాక్టీస్ ముగించుకొని వస్తున్న ఫొటోను షేర్ చేసి ఫొటోషాప్ లో అతడికి తలపాగా చుట్టి కళ్లద్దాలు పెట్టి కాలుమీద కాలు వేసుకున్నట్టు బిందాస్ గా ఉన్న ఫొటోను ఎడిట్ చేసి షేర్ చేసింది. రాజస్థాన్ యాజమాన్యం తమ సొంత కెప్టెన్ సంజూ శాంసన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ ట్వీట్ చేసింది. అయితే శాంసన్ దెబ్బకు ఆ పోస్టును తీసేయాల్సి వచ్చింది.
Also Read: Megastar Chiranjeevi: ఆర్ఆర్ఆర్ ఒక మాస్టర్ పీస్ – మెగాస్టార్ చిరంజీవి
నీలిరంగు తలపాగాతో పాటు పొడవాటి చెవిపోగులు పెట్టి శాంసన్ ను ఎగతాళి చేసే ప్రయత్నాన్ని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం చేసింది. ఈ కేరళకు చెందిన క్రికెటర్ ఫోటో మార్ఫింగ్ చేసింది. దీనిపై సీరియస్ అయిన సంజు శాంసన్ ఫ్రాంచైజీకి తగిన రీతిలో సోషల్ మీడియాలోనే క్లాస్ పీకాడు. సీరియస్ గా ప్రాక్టీస్ చేసి వస్తుంటే ఫ్రొఫెషనల్ గా ఉండాల్సింది పోయి ఈ కామెడీ పోస్ట్ ఏంటంటూ ఫైర్ అయ్యాడు. అధికారిక ఫ్రాంచైజీ అలా చేయడం వృత్తిపరమైనది కాదంటూ ఫన్నీ పిక్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఫ్రాంచైజీ ట్వీట్‌పై సంజూ శాంసన్ కలత చెందినట్లు కనిపించాడు. అతని సమాధానంలో అది స్పష్టంగా కనిపించింది. ఈ ఫొటోపై శాంసన్ అభ్యంతరాన్ని గుర్తించి రాజస్థాన్ యాజమాన్యం ఆ ట్వీట్‌ను తొలగించింది. ఏకంగా జట్టు యాజమాన్యానికి క్లాస్ పీకిన సంజూ శాంసన్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: CM Kcr- Prashant Kishor: వాళ్లను వద్దంటున్న పీకే.. కేసీఆర్ కు రిపోర్ట్.. ప్రక్షాళన తప్పదా..?
