https://oktelugu.com/

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సెకండ్ హాఫ్ లేదు.. ప్రముఖ క్రిటిక్ షాకింగ్ ట్వీట్

RRR Movie: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ఇది. పైగా ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. అందుకే, ఈ సినిమా కోసం ప్రేక్షకులు రెట్టింపు ఆసక్తితో ఎదురుచూశారు. అయితే, సగం సినిమా చూపించి.. మిగిలిన సినిమా చూపించకపోతే ఎలా ఉంటుంది ? అసలు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 25, 2022 / 07:15 PM IST
    Follow us on

    RRR Movie: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ఇది. పైగా ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. అందుకే, ఈ సినిమా కోసం ప్రేక్షకులు రెట్టింపు ఆసక్తితో ఎదురుచూశారు.

    RRR Movie

    అయితే, సగం సినిమా చూపించి.. మిగిలిన సినిమా చూపించకపోతే ఎలా ఉంటుంది ? అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా ? పైగా భారీ పాన్ ఇండియా సినిమాకి ఇలా జరగడం ఆశ్చర్యకరం. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది ? ఎవరికీ జరిగిందో తెలుసా ? కాలిఫోర్నియాలో జరిగింది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రాకి జరిగింది. ఈ విషయం గురించి ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ బాధ పడింది.

    Also Read: KGF 2 Update: ముఖ్య అతిథిగా నిజంగానే ప్రభాస్ వస్తున్నాడా ?

    ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రా శుక్రవారం ట్వీట్ చేస్తూ.. “థియేటర్ యాజమాన్యం ఆర్ఆర్ఆర్ సెకండ్ హాఫ్ తీసుకోలేదు. సినిమా ఇంతకన్నా ఎక్కువ ఉందని తమకు సమాచారం అందలేదని ఆ థియేటర్ మేనేజర్ చెప్పారు. నాకు ఆ సమాచారం నమ్మలేనంతగా నిరాశపరిచింది! ఒక్కసారిగా నేను ఏడవాలనుకుంటున్నాను” అంటూ అనుపమ మెసేజ్ చేసింది.

    ఏది ఏమైనా కాలిఫోర్నియా థియేటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫస్ట్ హాఫ్ చూపించి, సెకండ్ హాఫ్ చూపించకపోవడం బాధాకరమైన విషయమే. ఇక విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ లో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్ లలో విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది.

    RRR Movie

    పైగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొదటి రోజు రూ.73 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. తొలిరోజే ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం నిజంగా విశేషమే. బ్లాక్‌ బ‌స్ట‌ర్ ‘బాహుబ‌లి 2’ సినిమా కంటే కూడా ఈ చిత్రానికే రెట్టింపు కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు చూసుకుంటే ఇప్పటివరకూ అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సిమిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలవడం విశేషం.

    Also Read: TS Tet Notification 2022: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ లో కీలక మార్పులు.. నిబంధనలివీ

    Tags