Viral: తల్లి కావాలనేది ప్రతి ఒక్క మహిళ కళ. దాని కోసమే తన జీవితాన్ని పణంగా పెడుతుంది. పురిటినొప్పులు పునర్జన్మతో సమానమని తెలిసినా పుట్టబోయే బిడ్డకోసం ఎంతో తాపత్రయపడుతుంది. ఎన్ని త్యాగాలకైనా వెనుకాడదు. తన భర్త ఓ కేసులో ఇరవై సంవత్సరాల శిక్ష పడటంతో జైలులో ఉన్నాడు. దీంతో తనకు తల్లి కావాలనే ఆశ ఉందని తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని చేసిన విన్నపాన్ని కోర్టు మన్నించి అతడికి 15 రోజుల పెరోల్ మంజూరు చేయడం సంచలనం కలిగించింది. గతంలోనే ఇలాంటి కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారికి బెయిల్ కూడా మంజూరు అయింది. తమ భర్తతో సంసారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో కోర్టు కూడా వారి కోరికను మన్నించి వారికి బిడ్డను కనేందుకు భర్తలకు బెయిల్ మంజూరు చేసిన సంఘటనలున్నాయి.
![]()
రాజస్థాన్ లో రాహుల్ అనే వ్యక్తి ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో కోర్టు అతడికి ఇరవై సంవత్సరాల శిక్ష విధించింది. దీంతో అతడు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి భార్య తనకు తల్లి అయ్యే భాగ్యం కలిగించాలని కోర్టును వేడుకోవడంతో ఆమె కోరిక తీర్చేందుకు అతడికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. దీంతో ఆమె కోరిన కోరిక సజావుగానే ఉందని గుర్తించిన కోర్టు ఆమెకు తల్లి అయ్యేందుకు ఆమె భర్తను కొద్దిరోజులు విడిచిపెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు పెరోల్ మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో కూడా ఇలాంటి కేసులు వచ్చాయి. తమకు పిల్లలు కలిగేందుకు సహకరించాలని భార్యలు చేసిన విన్నపాన్ని గుర్తించి కోర్టులు బెయిల్ మంజూరు చేసిన దాఖలాలున్నాయి. దీంతో సదరు మహిళ పెట్టుకున్న అప్లికేషన్ ను మన్నించి ఆమెకు తల్లి అయ్యేందుకు భర్తకు పెరోల్ మంజూరు చేయడంతో ఆమె పదిహేను రోజులు తన భర్తతో సంసారం చేసి తల్లి కావాలని కోరుకోవడంలో తప్పు లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఆ మహిళ కోరికను తీర్చేందుకు కోర్టు అతడిని విడిచిపెట్టేందుకు సంకల్పించింది.
రాజస్థాన్ హైకోర్టు తీసుకున్న నిర్ణయం సముచితమైనదేనని అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. జైళ్లలో మగ్గే వారి కోసం భార్యతో కాలం గడిపే అవకాశం కల్పించడం నిజంగా ఆహ్వానించదగినదే. గుజరాత్ లో జైలులో ఉన్న ఖైదీల భార్యలతో గడిపేందుకు ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేయడం తెలిసిందే. దాంతో పోల్చుకుంటే పెరోల్ మంజూరు చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఖైదీల కోసం కోర్టులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్ లో నేరస్తులకు కూడా ఉపశమనం కలిగించేందుకు ఇలాంటి వ్యవహారాలు దోహదపడతాయనడంలో సందేహం లేదు.