Bhadrachalam Ram Temple : రాష్ట్రంలో దేవాదాయ భూములపై గద్దల కన్ను పడింది. సాక్షాత్తు దేవుడి మాన్యాలను మింగేయాలని చూస్తున్నారు. అన్య మతస్తులు మన దేవాదాయ భూములను కాజేయాలని చూడటం గమనార్హం. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందా అనే వాదనలు కూడా వస్తున్నాయి. రాముడి భూములను ఓ మతం వారు కబ్జా చేయాలని భావిస్తున్నారు. వందల కోట్ల విలువ చేసే దేవాదాయ భూములను కాజేసి ప్లాట్లుగా చేసి విక్రయించాలని కంకణం కట్టుకున్నారు. దీని కోసం గుట్టు చప్పుడు కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. భద్రాచలంలో రాముడి భూములపై క్రైస్తవ మాఫియా కన్నేసింది.

ఇంత జరుగుతున్నా దేవాదాయ శాఖ చోద్యం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ పార్టీ నేతలే ఈ దారుణానికి ఒడిగడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే దేవుడి భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటూ అడ్డు వచ్చిన అధికారులపై దాడులకు దిగుతున్నారు. అడిగేవాడు లేకపోవడంతో వారు ఆడిందే ఆటగా మారుతోంది. ఏపీలో క్రిస్టియన్ మతంలో కలిసిన నేతలు రాముడి భూములను కబ్జా చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారి ఆగడాలు పెరుగుతున్నాయి.
అధికారులు అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వారిపైనే బూతులకు దిగుతున్నారు. వైసీపీ నేతల తీరుతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి. ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తుందే కానీ అడ్డుకోవడానికి కనీసం ప్రయత్నాలు కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మన నేతలు కూడా వారితో కుమ్మక్కయ్యారా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాముడి భూములకే రక్షణ లేకుండా పోవడం ఆందోళనకు తావిస్తోంది. రాముడి భూములకే రక్షణ లేకుండా పోవడంతో ప్రజల్లో గుబులు రేగుతోంది.
వైఎస్సార్ పార్టీ నేతల అండదండలతోనే ఇదంతా జరుగుతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో సొంత పార్టీ వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడే వైసీపీ నేతలు రాముడి భూములను అప్పనంగా సొంతం చేసుకోవాలని చూడటం విమర్శలకు తావిస్తోంది. శ్రీరాముడి భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాముడి భూములను కావాలనే కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరుతున్నారు.