Rajasthan BITS Pilani : స్కూల్, కాలేజీ, యూనివర్శిటీలకు వెళ్లాలంటే కొందరికి ఇష్టం. మరికొందరికి కష్టం. ప్రతి రోజు వెళ్లడం బోర్ కదా. కానీ కొందరికి ఒక్కరోజు వెళ్లకపోయినా సరే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంటుంది. ఇష్టాఇష్టాల గురించి పక్కన పెడితే కాలేజీ, స్కూల్స్ కు వెళ్లకపోతే హాజరు శాతం తక్కువ ఉంటుంది. ఇలా ఉంటే కచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు. ఇక మార్కులు ఎంత ముఖ్యమో హాజరు కూడా అంతే ముఖ్యం. లేదంటే మీ పని అంతే. హాజరు లేకపోతే కొన్ని స్కూల్స్ లో అయితే బయట నిల్చోబెడతారు కదా. లేదంటే కొడతారు కూడా కదా. వామ్మో కాస్త ఆలస్యంగా వెళ్తేనే ఈ పనిష్‌మెంట్ లు ఉంటాయి. అలాంటిది వెళ్లకపోతే అనుకుంటున్నారా?
మీకు కాలేజ్ కు వెళ్లడం ఇష్టం లేదా? ప్రతి రోజు వెళ్లాలంటే బోర్ గా ఉందా? లెక్చరర్స్ చెప్పే క్లాసులు వినాలని లేదా? ఎంత సేపు ఈ సోదీ అనుకుంటున్నారా? అయినా తప్పడం లేదా? హాజరు లేకుండా ఏదైనా కాలేజీ ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు అలాంటి ఓ అద్భుతమైన విషయం తెలుసుకుందాం. మీరు క్లాసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. టార్చర్ ఫ్రీ ఎడ్యూకేషన్ అనుకోండి. అంటే వెళ్లాలి, పాఠాలు వినాలి, ప్రాజెక్ట్ లు చేయాలి, రాయాలి, రోజు సబ్ మిట్ చేయాలి వంటి తలకాయ నొప్పులు కూడా ఉండవు అన్నమాట.
అయితే ఏ విద్యాసంస్థలో అయినా సరే విద్యార్థుల హాజరును నమోదు చేయడం కామన్. హాజరు ఆధారంగానే వాల్లకు పరీక్షలు రాయడానికి హాల్ టికెట్లను కూడా ఇస్తుంటారు. సరిపడా అటెండెన్స్ లేని విద్యార్థులకు పరీక్షకు అనుమతించరు. కానీ రాజస్థాన్ బిట్స్ పిలానీలో మాత్రం హాజరు ప్రస్తావన అసలు ఉండదట. ఈ నాలుగు గోడల మధ్య చెప్పే పాఠాల కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ అవసరం అని భావిస్తారట. అందుకే జీరో అటెండెన్స్ పాలసీని అమలు చేస్తుంది ఈ బిట్స్ పిలానీ.
అక్కడ చేరిన వాళ్లు పలు సంస్థల్లో ఇంటర్న్ షిప్పులు చేయవచ్చు. స్టార్టప్ లలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదనపు నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంక్యూబేషన్ ప్రాజెక్ట్ లలో కూడా భాగం అయ్యే ఛాన్స్ ఉంది. విదేశాల్లోని పలు యూనివర్సిటీలలో ఇప్పటికే ఈ విధానం కొనసాగుతుంది. అయితే అలాంటిది మన దేశంలో తొలిసారిగా ఈ బిట్స్ మాత్రమే అవలంబిస్తోంది. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం బిట్స్ చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుంది. కచ్చితంగా ఏదో ఒకటి మాత్రం చేయాల్సిందే అంటున్నారు అక్కడి లెక్చరర్లు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.