UCC : ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. 77 సంవత్సరాల స్వాతంత్ర్యం అనంతరం మహిళలు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే రోజు. మహిళలకు ప్రయోజనకారిగా ఇంతకన్నా ఏమీ ఉండదు. అంబేద్కర్ తపన పడ్డాడు. రాజ్యాంగ సభ చర్చలోనే దేశంలోని అందరికీ మతం, కులం, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఒకే చట్టం తేవాలని కోరాడు. కానీ అది ఇప్పటికీ నెరవేరలేదు.
దేశంలోనే ఒకే చట్టం ఒక న్యాయం ను దేవ భూమి ఉత్తరఖాండ్ లో తొలిసారి అమలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు అప్పుడు ఎటువంటి అభిప్రాయం వచ్చిందో.. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో యూసీసీ అమలు చరిత్రాత్మకంగా మారింది.
ఉత్తరాఖండ్ లో 2022లో వాగ్ధానం చేయడం.. మే 27న ఒక కమిటీ వేయడం.. ఒకటిన్నర సంవత్సరాలు విస్తృత చర్చలు జరిపారు. అభిప్రాయ సేకరణ చేశారు. 700 పేజీలకు పైగా నివేదిక.. 4వ తేదిన ఆమోదించడం.. 2024 మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చట్టం అమలు జరిగింది. అమలు కోసం కమిటీ ఏర్పాటు చేసి అన్ని పనులు పూర్తి చేసి జనవరి 27న ఈరోజు యూసీసీని ఉత్తరాఖండ్ లో అమలు చేశారు.
పురుషులు, స్త్రీలకు లింగ విభేదం లేకుండా అన్ని సమాన హక్కులు ఇందులో కల్పించారు. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలని తప్పనిసరి చేశారు.
ఒకే చట్టం ఒకే న్యాయం దిశగా దేశంలో అడుగులు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.