https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి మార్క్ ట్విస్ట్.. అదేనట..!

దర్శక దిగ్గజం రాజమౌళి ‘బాహుబలి’ సిరీసుల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ఒక్కో సీన్ ను  జక్కన్న నెమ్మదిగా చెక్కుతున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రెండు టీజర్లు విడుదలై సన్సేషన్ క్రియేట్ చేశాయి. Also Read: పొరపాటును సరిద్దిదుకొని.. ప్రభాస్ కు విషెస్ చెప్పిన మహేష్..! రాంచరణ్ పుట్టిన రోజున ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ రిలీజైంది. చరణ్ యాక్షన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 03:04 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి ‘బాహుబలి’ సిరీసుల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ఒక్కో సీన్ ను  జక్కన్న నెమ్మదిగా చెక్కుతున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రెండు టీజర్లు విడుదలై సన్సేషన్ క్రియేట్ చేశాయి.

    Also Read: పొరపాటును సరిద్దిదుకొని.. ప్రభాస్ కు విషెస్ చెప్పిన మహేష్..!

    రాంచరణ్ పుట్టిన రోజున ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ రిలీజైంది. చరణ్ యాక్షన్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించడం హైలట్ గా నిలిచింది. చరణ్ పోలీస్ అధికారిగా కన్పించి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఈ టీజర్ యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించి కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రిలీజైంది

    ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎంతో ఊరిస్తూ వచ్చిన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ఫ్యాన్స్ అంచనాలను నిలబెట్టుకోగలిగింది. ఎన్టీఆర్ యాక్షన్ కుతోడు చరణ్ వాయిస్ ఓవర్ అభిమానులకు కనెక్ట్ అయింది. దీంతో ఈ టీజర్ విడుదలైన కొద్ది క్షణాల్లో వైరల్ అయింది. ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఈ టీజర్ ట్రెండింగులోకి దూసుకెళ్లింది.

    అయితే ఈ టీజర్ చివర్లో ఎన్టీఆర్ ను ముస్లిం గెటప్ లో చూపించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నైజాం మీద అవిశ్రాంత పోరు చేసిన కొమురంభీం ను ముస్లింగా చూపించి రాజమౌళి చరిత్రను తప్పుబట్టిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. అయితే రాజమౌళి ముందుగానే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఫిక్షన్ సినిమా అని ప్రకటించాడు.

    Also Read: పాన్ ఇండియా పఠాన్.. సాహో.. హ్యాపీ బర్త్ డే ప్రభాస్

    ఈ మూవీలో కన్పించిన ముస్లిం గెటప్ సినిమాలో అతిపెద్ద ట్వీస్టుగా ఉండబోతుందని తెలుస్తోంది. కొమురంభీం.. అల్లూరి అజ్ఞాతంలో ఉండగా ఓసారి కలిసినట్లు జక్కన్న చూపించబోతున్నాడు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో కన్పిస్తాడని తెలుస్తోంది. నిజాంపై పోరాటంలో భాగంగానే కొమరంభీమ్ ముస్లిం గెటప్ వేసుకొని అతడి అడ్డాలో చేరుతాడని తెలుస్తోంది.

    ఆ తర్వాత నిజాం పాలకుడి ఆటకట్టిస్తాడని.. ఇదే సినిమాలో అసలు ట్వీస్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఇదంతా జక్కన్న మార్క్ ట్వీస్ట్ అంటూ కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఫిక్షన్ మూవీ అంటూనే దర్శకుడు రాజమౌళి అల్లూరి.. కొమురంభీంల అజ్ఞాతాన్ని కూడా తెరపై చూపించడం మరింత ఆసక్తిని రేపుతోంది.