
Rajamouli- Mahesh Babu: ఇరవై ఏళ్ల కెరీర్లో 12 సినిమాలు తీసిన రాజమౌళి తన రేంజ్ పెంచుకుంటూ వచ్చారు. సాధారణంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు ఆ రేంజ్ హిట్ కొట్టేందుకు ఏళ్ల సమయం తీసుకుంటారు. ఒక్కోసారి అసలు వల్ల కాకపోవచ్చు కూడా. పూరి పోకిరి, శ్రీను వైట్ల దూకుడు, వివి వినాయక్ ఆది వంటి బ్లాక్ బస్టర్స్ మళ్ళీ తీయలేకపోయారు. రాజమౌళి మాత్రం అందుకు భిన్నం. సింహాద్రి తోపు అనుకుంటే ఛత్రపతితో చరిత్ర సృష్టించాడు. ఛత్రపతిని మగధీరతో మర్చిపోయేలా చేశాడు. మగధీర వంటి సినిమా ఇక తీయలేడు అనుకుంటే… దాని బాబు లాంటి బాహుబలిని సృష్టించారు.
రాజమౌళి కెరీర్ కి బాహుబలి సిరీసే హైయెస్ట్ అనుకుంటే… ఆర్ ఆర్ ఆర్ తో ఆస్కార్ రేంజ్ కి వెళ్ళాడు. రాజమౌళి రేంజ్ పెరగడమే కానీ తగ్గడం ఉండదని రుజువు చేశాడు. ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ డైరెక్టర్ గా మారిన రాజమౌళి హీరో మహేష్ బాబుకి అతిపెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. మహేష్ తో చేయబోయే చిత్రం బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ లను మించి ఉంటుందని సమాచారం అందుతుంది.
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని టాప్ సీక్రెట్స్ బయటకు రాగా… రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నారన్న క్లారిటీ వచ్చింది. ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ జోనర్లో తెరకెక్కుతుంది. మహేష్ పాత్రకు రామాయణంలో హనుమంతుడు స్ఫూర్తి. ఇండియానా జోన్స్ ఛాయలు ఉంటాయట. హాలీవుడ్ హీరోయిన్ మహేష్ కి జంటగా నటించనుంది. మహేష్ ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తారు.

మహేష్ పూర్తిగా మేకోవర్ కానున్నారట. ఈ మేరకు రాజమౌళి ఇప్పటికే మహేష్ కి సూచనలు చేశారట. గతంలో ఎన్నడూ చూడని మహేష్ ని రాజమౌళి చూపిస్తాడట. ఇక ఈ చిత్రం మూడు భాగాలుగా విడుదల కానుంది. ఒక్కో పార్ట్ బడ్జెట్ రూ. 700 కోట్లు. మూడు భాగాలకు దాదాపు రూ. 2000 కోట్లు. పదేళ్ల సమయం మూడు భాగాలకు తీసుకోనుందట. ఈ పదేళ్లలో మహేష్ చేసేది రాజమౌళి చిత్రాలు మాత్రమే అంటున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం హాలీవుడ్ చిత్రాలను తలదన్నే చిత్రం అవుతుంది అంటున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లకు మించిన విజయాన్ని రాజమౌళి మహేష్ కి ఇవ్వబోతున్నాడట.