
Texas Blast: అమెరికాలోని టెక్సాస్ లో భారీ పేలుడు సంభవించి 18,000 అవులు మృతి చెందాయి. అమెరికాలో రోజూ వధిస్తున్న గోవులతో పోల్చితే ఈ పేలుడులో మరణించిన ఆవుల సంఖ్య మూడు రెట్లు అధికం. అయితే ఈ సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా ఈ స్థాయిలో ఆవులు మరణించడం సంచలనం రేకెత్తించింది. అయితే ఈ పేలుడులో కేవలం పశువులు మాత్రమే చనిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో గాయపడిన ఓ డెయిరీ కార్మికురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో కోరుకుంటున్నది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డిమ్మిట్ లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫామ్ ఉంది. ఇక్కడ వేల సంఖ్యలో పశువులను సాకుతున్నారు. వీటి పాలను టెక్సాస్ లోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు 18 వేల పశువులు మృతి చెందాయి. ఇక ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ 36 బిలియన్ డాలర్లు ఉంటుందని సమాచారం. 2013 తర్వాత డెయిరీ ఫామ్ లో ఇంత పెద్ద దుర్ఘటన జరగటం ఇదే మొదటిసారి.
డెయిరీ ఫామ్ లో ఆవులకు పాలు పితికేందుకు సిద్ధమవుతున్న సందర్భంలో ఈ ఘటన సంభవించినట్టు తెలుస్తోంది. డెయిరీ ఫామ్ లో యంత్రాలు బాగా వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అధికారులు ప్రాథమిక అంచనాగ వచ్చారు. పేలుడు తర్వాత డెయిరీ ఫామ్ లో మీథేన్ గ్యాస్ ఒకసారిగా విడుదలైనట్టు తెలుస్తోంది. దీంతోనే ఎక్కువ ఆవులు మరణించాయని అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేడ ఎక్కువ నిల్వ ఉండటం వల్లే మీథేన్ గ్యాస్ పెద్ద ఎత్తున ఏర్పడినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి అమెరికా వంటి దేశాల్లో ఒకేచోట భారీ ఎత్తున ఆవులను పెంచుతారు. 15వేల కంటే ఎక్కువ ఆవులు ఉంటే దానిని బార్ గా వ్యవహరిస్తారు. పైగా అక్కడి ఫామ్ లలో పాలు పితికేందుకు ఎక్కువగా యంత్రాలు వినియోగిస్తుంటారు. కొద్ది మంది మాత్రమే పనివారు ఉంటారు. అజగా జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు అదుపు చేయడం కుదరలేదు. ఎక్కువ సంఖ్యలో పశువులు మరణించాయి. భద్రపరిచే గదిలో ఒక మహిళ చిక్కుకుపోయి గాయాలతో బయటపడింది.. ఇక మీథేన్ వాయువు కు పేలే స్వభావమున్న నేపథ్యంలో ఫామ్ లో భారీ ఎత్తున నష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.