
Ramba : ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ రంభ. తన అందంతో కుర్రకారులో మత్తు జల్లేది. ఆమె సినిమాలు మంచి హిట్లు సాధించాయి. పెద్ద హీరోలందరితో జతకట్టిన రంభ పెళ్లయ్యాక నటనకు దూరమైంది. సంసారంలో బిజీగా మారిపోయింది. ఆమె నటించిన సినిమాలు చాలా వరకు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. దీంతో ఆమెకు ఫాలోవర్స్ పెరిగిపోయారు.
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కరువైన సమయంలో రంభ ఎంట్రీ ఇచ్చింది. తన అందంతో అదరగొట్టింది. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరితో నటించింది. దీంతో గ్లామర్ హీరోయిన్ గా ముద్ర పడింది. చిరంజీవితో అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా సినిమాల్లో నటించి మెప్పించింది. అందరు పెద్ద హీరోలతో మంచి హిట్లు సాధించింది.
పెళ్లికి ముందు రంభకు ఓ అభిమాని తనను పెళ్లి చేసుకుంటానని గోల చేశాడు. ఇది అప్పుడు వైరల్ అయింది. ఇలా రంభ తన అందంతో మత్తెక్కించే చూపులతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. పెద్ద పెద్ద దర్శకులతో కూడా పనిచేసింది. పెళ్లయ్యాక సినిమాలకు దూరమైనా సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి దగ్గరగానే ఉంది.
రంభ ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తీసిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన అందంతో అందరిని కలవరపెడుతోంది. ఆమె అందాన్ని చూస్తే గుక్క తిప్పుకోలేకపోతున్నారు. మత్తెక్కించే అందంతో చీర కట్టులో సొగసులు చూపిస్తుండటంతో మగవారి చూపులు అక్కడే పడుతున్నాయి. ఆమె అందానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను చూసిన వారికి అబ్బా అనడం ఖాయం.