
Rajamouli- Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ కాంబినేషన్ కి ఉన్న హైప్ అలాంటిది. దర్శకుడు రాజమౌళితో మూవీ అంటే జయాపజయాల ప్రస్తావన ఉండదు. కేవలం రికార్డుల గురించి చర్చ మాత్రమే నడుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆస్కార్ కొల్లగొట్టడంతో అంచనాలు మరో రేంజ్ కి వెళ్లాయి. అలాగే రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ లో మహేష్ మూవీ తెరకెక్కనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తగ్గకుండా రూ. 1000 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి మహేష్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.
ఇక మహేష్ మూవీ జానర్, కథ మీద ఓ హింట్ కూడా ఇచ్చారు. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కథగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పని చేయబోతున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ కోసం బడా స్టూడియోలతో చర్చలు జరిపారు. కథలో భాగంగా హాలీవుడ్ టాప్ హీరోయిన్ ని రంగంలోకి దించుతున్నారట.
ఈ మూవీ నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ కాకరేపుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. చాలా వరకు పూర్తి చేశారని వినికిడి. కాగా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. ఈ మేరకు రాజమౌళి హీరో మహేష్ కి సూచనలు చేశారట. మహేష్-రాజమౌళి చిత్రం సెప్టెంబర్ నుండి నిరవధికంగా షూటింగ్ జరుపుకోనుందని లేటెస్ట్ టాక్. మహేష్ ఫ్యాన్స్ దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సమ్మర్ చివరి కల్లా త్రివిక్రమ్ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. అప్పటి నుండి విరామం లేకుండా మహేష్ రాజమౌళి మూవీ కోసం సిద్ధం కావాల్సి ఉంది. తన హీరోలను గత చిత్రాలకు భిన్నంగా చూపించడం రాజమౌళికి అలవాటు. బాహుబలి సిరీస్ నుండి హీరోల చేత కండలు పెంచి, సిక్స్ ప్యాక్ తో ప్రజెంట్ చేస్తున్నారు. ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కండల వీరులుగా చూపించి సక్సెస్ అయ్యారు. మహేష్ కెరీర్లో చొక్కా విప్పింది లేదు. మహేష్ ని సిక్స్ ప్యాక్ లో ప్రెజెంట్ చేస్తే… అది సినిమాకు విపరీతమైన ప్రచారం తెస్తుంది.