
Nani- Srikanth Odela: ఒక సినిమా సక్సెస్ ఫుల్ గా పూర్తి కావాలంటే డైరెక్టర్ కోఆర్డినేషన్ బాగుండాలి. నటులతో పాటు ముఖ్యంగా హీరోతో కమ్యూనికేషన్ మెయింటేన్ చేయాలి. వీరిద్దరి మధ్య క్లాషెస్ వస్తే సినిమా రూపం చెడుతుంది. అయితే ఒక్కోసారి స్టార్ హీరోతో సినిమాను తీసేటప్పుడు కొందరు కొత్త డైరెక్టర్లు ఆందోళన చెందుతుంటారు. తాము అనుకున్న సీన్ రాకపోయేసరికి వారిని ఇబ్బంది పెట్టలేక నిరాశ చెందుతారు. ‘దసరా’ సినిమా షూటింగ్ సందర్భంగా స్టార్ హీరో నాని ఎంతో కోఆపరేటివ్ చేశారని కొత్ డైరెక్టర్ శ్రీకాంత్ పలు సందర్భాల్లో చెప్పారు. కానీ ఓ విషయంలో మాత్రం నానిపై కోపం వచ్చిందని అంటున్నారు. శ్రీకాంత్ ఓదెల నానిపై చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెలకు ‘దసరా’ ఫస్ట్ మూవీ. ఫస్ట్ సినిమాను డైరెక్షన్ చేసే ఏ వ్యక్తికైనా కొంచెం ఆందోళనగానే ఉంటుంది. అదీ స్టార్ హీరోతో కావడంతో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. ఏ హీరోతో ఎలా మెదులుకోవాలో ఆయనకు తెలుసు. కానీ డైరెక్షన్ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ ఫ్రెషర్ వేరే ఉంటుంది. ముఖ్యంగా సినిమా షూటింగ్ సమయంలో ఉండే ఒత్తిడితో ఒక్కోసారి సహనం కోల్పోవాల్సి వస్తుంది. అలా ఓ విషయంలో నానిపై కోపం వచ్చిందని శ్రీకాంత్ ఓదెల అంటున్నారు.
సినిమా పూర్తయిన తరువాత నాని ఫస్ట్ పార్ట్ చూశారు. కానీ సెకండ్ పార్ట్ చూడాల్సి ఉంది. ఈ సమయంలో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నాయర్ తో చూస్తానని డైరెక్టర్ తో చెప్పాడు. అయితే సెకండ్ పార్ట్ స్ట్రాటింగ్ నుంచి చూస్తారని శ్రీకాంత్ అనుకున్నారట. కానీ హీరో మాత్రం 63 నుంచి చూశారు. ఈ విషయాన్ని ఆ తరువాత ఓ సందర్భంలో నానిని డైరెక్టర్ అడిగారు. అన్న సెకండ్ పార్ట్ చూశారా? అని అడగ్గానే చూశానని నాని చెప్పారు. అయితే ఎక్కడి నుంచి చూశారని అడగ్గా 63 నుంచి అని చెప్పారు.

అయితే సెకండ్ పార్ట్ స్ట్రాటింగ్ నుంచి చూసి నాని ఎమోషనల్ అవుతాడని, ఆ విషయాన్ని తనతో షేర్ చేసుకుంటాడని శ్రీకాంత్ ఎక్స్ పెక్టేషన్ చేశారు. కానీ నాని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరాశ చెందారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ మీడియా చర్చ సందర్భంగా శ్రీకాంత్ ఓదెల బయటపెట్టారు. ఇదే సమయంలో అక్కడున్న కీర్త సురేశ్ సైతం శ్రీకాంత్ చెప్పిన విషయాన్ని ఆసక్తిగా విన్నారు. ఒక సినిమా సమయంలో డైరెక్టర్, హీరో మధ్య కో ఆర్డినేషన్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. అయితే ఆ విషయంలో మాత్రం కాస్త నిరాశ చెందానని చెప్పడంపై చర్చ సాగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి..