Raj Kasireddy: మద్యం కుంభకోణం జరిగిందని చెబుతున్న కూటమి ప్రభుత్వం.. వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచింది. ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయిరెడ్డిని విచారించింది. ఈ క్రమంలో ఆయన సంచలన విషయాలు చెప్పారని.. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన పాత్ర ఉందని ఓవర్గం మీడియా రాసింది. అంతేకాదు విజయసాయిరెడ్డి ఈ కుంభకోణంలో పావు మాత్రమేనని.. అసలు వ్యక్తి కసిరెడ్డి రాజ్ అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆ మీడియా తన కథనాలలో పేర్కొంది. అంతేకాదు దానికి సంబంధించిన ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది. అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముగించిన తర్వాత వైసిపి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కసిరెడ్డి రాజ్ తనని కూడా మోసం చేశారని.. అతడు చేతిలో నేను పావు అయ్యానని విజయసాయిరెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజ్ కు ప్రధాన పాత్ర ఉందని విమర్శించారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి తాను సహకరిస్తానని.. అసలు విషయాలు మొత్తం బయట పెడతానని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయి వ్యాఖ్యలను వైసీపీ అనుకూల మీడియా ఖండించింది. అంతేకాదు నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసలు మద్యం కుంభకోణం అనేది జరగలేదని రాస్కొచ్చింది. అంతేకాదు చంద్రబాబు ఆడించినట్టు విజయసారెడ్డి ఆడుతున్నారని.. ఆ ప్రణాళికలో భాగంగానే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారని తన కథనంలో పేర్కొంది.
Also Read: ఈసారి విజయసాయిరెడ్డి ఏ బాంబు పేల్చుతారో?
సంచలన నిజాలు వెలుగులోకి
తనపై విజయ సాయి రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో కసిరెడ్డి రాజ్ ఒక సంచలన ఆడియో మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియోలో పలు విషయాలను రాజ్ వెల్లడించారు. ఆ ఆడియో సందేశంలో రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు..” మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రాజ్ కసిరెడ్డి. కొద్దిరోజులుగా నామీద రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఏపీలో జరిగిన మద్యం వ్యవహారంలో నా పేరు ఉందని కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో నా ప్రమేయం లేదు. అనవసరంగా నా పేరు బయటికి లాగుతున్నారు. ఇందులో ఏం జరిగింది? నాడు ప్రభుత్వం ఎలాంటి విధానాలను అవలంబించింది? అనే విషయాలపై నేను పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తాను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పిస్తాను. అతి త్వరలో మీడియా ముందుకు వస్తాను. నామీద ఆరోపణలు చేస్తున్న వారిని చట్టపరంగానే ఎదుర్కొంటాను. అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వ్యక్తులు చేస్తున్న పనులను ఉపేక్షించను.. కచ్చితంగా మీడియా ముందుకు వస్తాను.. అన్ని ఆధారాలు బయటపెడతాను. ఈ అంశాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని” రాజ్ కసిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్ కసిరెడ్డి పై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. దానికి కౌంటర్ గా రాజ్ కసిరెడ్డి ఆడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. చూడబోతే ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
https://www.youtube.com/watch?v=7N3qZEcMUpw