Raai Laxmi: పొడుగు సుందరి లక్ష్మీ రాయ్ అలియాస్ రాయ్ లక్ష్మీ చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ కన్నడ భామ ఐశ్వర్య రాయ్ రేంజ్ కి వెళుతుందనుకుంటే కెరీర్ సాఫీగా సాగలేదు. అడపాదడపా సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన లక్ష్మీ రాయ్ 2005లో నటిగా మారారు. తమిళ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. తెలుగులో ఆమె ఫస్ట్ మూవీ కాంచనమాల కేబుల్ టీవీ. శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ ఆడలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ నీకు నాకు టైటిల్ తో ఓ చిన్న మూవీ చేశారు.

తర్వాత తెలుగులో లక్ష్మీ రాయ్ కి అవకాశాలు రాలేదు. ఎక్కువగా తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు చేశారు. బాలయ్య అట్టర్ ప్లాప్ మూవీ అధినాయకుడు చిత్రంలో లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా నటించారు. అనంతరం 2017లో చిరంజీవి కమ్ బ్యాక్ చిత్రం ఖైదీ నెంబర్ 150లో స్పెషల్ సాంగ్ చేశారు. ఆ సాంగ్ ఆమెకు పాపులారిటీ తెచ్చింది. అప్పటికే తెలుగులో ఫేడ్ అవుటైన లక్ష్మీ రాయ్ కి ఆఫర్స్ రాలేదు.
సినిమా కంటే ఎఫైర్ రూమర్స్ తో రాయ్ లక్ష్మీ వార్తల్లో నిలిచారు. స్టార్ క్రికెటర్ ధోనితో ఆమె ఎఫైర్ నడిపినట్లు కథనాలు వినిపించాయి. స్టార్ గా ఎదిగిన ధోని లక్ష్మీ రాయ్ తో ప్రేమాయణం సాగించాడని గట్టిగా వినిపించింది. పలుమార్లు ధోనితో ఎఫైర్ గురించి రాయ్ లక్ష్మీని అడగడం జరిగింది. ఆమె సున్నితంగా కొట్టిపారేశారు. ధోనితో పాటు ఒకరిద్దరు హీరోలతో ఆమె ఎఫైర్ నడిపారన్న వాదనలు ఉన్నాయి. గ్లామర్ ఫీల్డ్ లో ఇవన్నీ కామనే. ఎఫైర్స్ వార్తలు రావడం వాటిని హీరోయిన్స్ ఖండించడం మామూలే.

ఇదిలా ఉంటే టాప్ మోడల్ అయిన లక్ష్మీ రాయ్ ఇంస్టాగ్రామ్ వేదికగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తారు. రాయ్ లక్ష్మీ అందాలకు అలవాటు పడ్డ కుర్రాళ్ళు మిలియన్స్ లో ఉన్నారు. అరవై లక్షలకు పైగా ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. మితిమీరిన రాయ్ లక్ష్మీ హాట్ ఫోజులు తరుచుగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా బ్రా ధరించి కెమెరా ముందు ఫోజులిచ్చారు. రాయ్ లక్ష్మీ అందాల ధాటికి కుర్రాళ్లు బేజారు అవుతున్నారు.