Cheetahs In Madhya Pradesh: నమిబియా నుంచి ఇండియాకు వచ్చిన చీతాల తొలి వేట విజయవంతంగా పూర్తయింది. సోమవారం సాయంత్రం సుమారు 70 కిలోల బరువున్న మచ్చల జింకను వేటాడాయి. ఈ వేటలో రెండు చీతాలు పాలుపంచుకున్నాయి. మొదట్లో ఇక్కడి వాతావరణానికి చీతాలు అలవాటు పడబోవని అధికారులు భావించారు. ఎందుకైనా మంచిదని నమీబియా నుంచి రాగానే 45 రోజులపాటు వాటిని ప్రత్యేకంగా ఒక ఎన్క్లోజర్లో క్వారంటైన్ లో ఉంచారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేలా చేశారు. రోజుకు సుమారు 40 కిలోల గొడ్డు మాంసం వాటికి పెట్టేవారు.. 45 రోజుల పీరియడ్ ముగియగానే వాటిని మధ్యప్రదేశ్ లోని కునో రిజర్వ్ ఫారెస్ట్ లో వదిలిపెట్టారు.

వేటను ప్రారంభించాయి
అధికారులు చీతాలను వదిలిపెట్టగానే అవి రయ్యమంటూ దూసుకెళ్లాయి.. పైగా కునో ఫారెస్ట్ లో మచ్చల జింకల సంఖ్య ఈ మధ్య బాగా పెరిగింది.. దీంతో ఆ చీతాల గుంపు మచ్చల జింకల మీద పడింది. ఈ క్రమంలో రెండు చీతాలు ఒక జింకను వేటాడి చంపితిన్నాయి.. ఈ దృశ్యాలు అడవిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కాగా తన జన్మదినం సందర్భంగా మంత్రి నరేంద్ర మోడీ నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో వచ్చిన ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్ లోని కునో ఫారెస్ట్ లో వదిలిపెట్టారు. అయితే మొదట్లో ఈ చీతాలు బలహీనంగా కనిపించాయి. దీంతో అధికారులు కొంత ఆందోళన చెందారు. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయో లేదోనని సందిగ్ధంలో పడ్డారు.. 45 రోజులపాటు వాటిని ఎన్ క్లోజర్ లో ఉంచారు. ఈ సమయంలో వాటికి గొడ్డు మాంసాన్ని ఆహారంగా అందించారు. 45 రోజుల పీరియడ్ తర్వాత అవి స్వేచ్ఛగా అడవిలో తిరగడం ప్రారంభించాయి. నమిబియా అడవుల్లో మాదిరే ఇక్కడ కూడా వేటను మొదలుపెట్టాయి. తొలిరోజు మచ్చల జింకను చంపితిన్నాయి.

ఎందుకు తీసుకొచ్చారంటే
దేశంలో చీతాలు అవతరించిపోయాయి. క్రమంలో దేశంలో వాటి సంతతి పెంచాలని కేంద్ర పర్యావరణ శాఖ యోచించింది.. ఇందులో భాగంగానే ఆఫ్రికా ఖండంలోని నమ్మిబియా దేశంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఐదు ఆడ, మూడు మగ చీతాలను తీసుకొచ్చారు. ఆడ చీతాల వయసు రెండు నుంచి ఐదు సంవత్సరాలుగా ఉంది. మగ చీతాల వయసు నాలుగున్నర నుంచి ఐదున్నర ఏళ్లుగా ఉంది.. వీటి తరలింపునకు నమీబియా కేంద్రంగా పనిచేస్తున్న చీతాల సంరక్షణ సంస్థ భారతదేశానికి సహకరించింది. నమిబియా నుంచి గ్వాలియర్ దాకా ప్రత్యేక విమానంలో… ఇక్కడి నుంచి చినూక్ అనే వైమానిక హెలికాప్టర్లో చీతాలను తీసుకొచ్చారు.. కాగా ఈ చీతాల మధ్య మోడీ తన 72వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అయితే వీటిలో ఒక అడ చీతా మూడు నెలల గర్భంతో ఉంది.