Pawan Kalyan- Ippatam Village: మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల పునరాభివృద్దిలో భాగంగా గ్రామంలో ఉన్న ఇళ్ళని ధ్వంసం చేసింది. ఇళ్ళని కూల్చివేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా సర్క్యూలేట్ అయ్యాయి. ఈ ఘటన అందరినీ మనస్తాపానికి గురిచేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించి ప్రభుత్వ దమనకాండపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై విమర్శలు రావడంతో కేవలం ప్రహరీగోడలను మాత్రమే కూల్చాము అంటూ ప్రకటన ఇచ్చింది.

ప్రభుత్వ అధికార ప్రతినిధులు బెదిరిస్తున్న కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం గ్రామప్రజలు స్వచ్చంధంగా తమ భూములు ఇవ్వడమే వారిపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యకు కారణమని ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సభ కోసం స్థలం ఇచ్చారనే ప్రభుత్వం అక్కసుతో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు నోటీసులు ఇచ్చి ఇళ్ళని కూల్చివేశారంటూ ప్రధానంగా వినిపిస్తున్న వార్త.. తన సభని నిర్వహించుకునేందుకు నిండు మనస్సుతో స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామ ప్రజలకు కృతజ్ఞతగా పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయిలు గ్రామపంచాయితీకి విరాళం అందించాడు.
ఇప్పుడు మరోసారి ఇప్పటం గ్రామ ప్రజలకు ఆర్ధిక సహాయం చేశాడు పవన్ కళ్యాణ్..వైసీపీ ప్రభుత్వం దాష్టికానికి ఇల్లు దెబ్బ తిన్న, నివాసయోగ్యం కోల్పోయి రోడ్డు మీద పడ్డ జనాలకు లక్ష రూపాయిల చొప్పున ప్రతి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు.. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసాడు..ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మనగళగిరిలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ వద్దకి పిలిపించుకొని మీడియా ముఖంగా నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అతి త్వరలోనే అందించనున్నారు పవన్ కళ్యాణ్.

ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా ఎన్నో వందల కుటుంబాలకు కోట్ల రూపాయిలు దానం చేసి తన ఉదార స్వభావం ని చాటుకున్న పవన్ కళ్యాణ్..మరోసారి నష్టపోయి వీధిన పడిన కుటుంబాలను ఆదుకోవడం కోసం ముందుకొచ్చారు. ఈ చర్య పవన్ కళ్యాణ్ ని ద్వేశించేవారు కూడా ప్రశంసించేలా చేసింది..ఇలాంటి నాయకుడు దొరకడం నిజంగా మన అదృష్టం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు.