Twitter: మైక్రో బ్లాగింగ్ లో ట్విట్టర్ ఒక సంచలనం. కానీ రాను రాను ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా దేశాల్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఫలితంగా సమాజంలో ఉన్నత వ్యక్తులు ట్విట్టర్లో తమ ఖాతాలను తొలగించుకున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్ళింది. ఇంత అతడు ట్విట్టర్ లో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. పరాగ్ అగర్వాల్, గద్దె విజయను ఇంటికి సాగనంపాడు. వారికి మిలియన్ డాలర్ల పరిహారం అందజేశాడు. తన మాతృ సంస్థ అయిన టెస్లా నుంచి ట్విట్టర్లో పెట్టుబడులు పెట్టడంతో ఆ సంస్థ షేర్లు క్షీణించాయి. ఫలితంగా మస్క్ తన వ్యక్తిగత సంపదను చాలా వరకు కోల్పోయాడు. దీనికి తోడు ఇటీవల అతడు తీసుకున్న స్పెసిఫైడ్ ఎకౌంట్ ఛార్జ్ విధానం వివాదాస్పదమైంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే ట్విట్టర్లో ఇన్నాళ్లు ఏం జరిగింది? దాని అసలు రంగు ఏమిటి? అల్గారిథం పేరుతో ఎన్ని ఎకౌంట్లు తొలగించింది? ఇప్పుడు ఇవే తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

రోజులు గడిచేకొద్దీ..
రోజులు గడుస్తున్న కొద్ది ట్విట్టర్లో అసలు రాసారు బయటపడుతున్నాయి. ట్విట్టర్లో కేవలం వామపక్ష భావజాలం ఉన్న వారి ఖాతాలకే భద్రత ఉండేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకి ట్విట్టర్లో బాబీ లోన్ బి అనే పేరుతో ఒక ఎకౌంటు ఉంది. ఇది సాంప్రదాయవాదుల సమూహానికి చెందినది .. అయితే ఈ గ్రూపులో పెట్టిన ట్వీట్లు తరచూ డిలీట్ అవుతూ ఉండేవి. లేదా ఈ సమూహంలో వ్యక్తులు చేసే ట్వీట్లు వాళ్ల ప్రమేయం లేకుండానే ఎడిట్ అవుతూ ఉండేవి.. ట్వీట్ అవుతూ ఉండేవి.. అయితే వీటిని ఆ గ్రూపులో ఉన్న సభ్యులు జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టారు.. వాస్తవానికి వారు పెట్టే ట్విట్లల్లో ఎటువంటి అభ్యంతరకరమైన పదాలు ఉండేవి కావు. ఎందుకు చేస్తున్నారో వారికి అర్థమయ్యేది కాదు. అయితే ఎవరు ఇలాంటి పనిచేయకుండా ఉండేందుకు అప్పటి ట్విట్టర్ సీఈవో అగర్వాల్ ఒక ఆల్గారిథం రూపొందించాడు. అయితే ఈ ఆల్గారిథం పై అనుమానం వచ్చి యువ మహిళా పారిశ్రామికవేత్త లోతుగా పరిశీలించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆమె రెండు ఎకౌంట్లు క్రియేట్ చేసింది. ఒక ఎకౌంట్లో లెఫ్ట్ వింగ్ వాళ్లను సమర్థిస్తూ ట్వీట్లు పెట్టేది. ఇంకో అకౌంట్లో రైట్ వింగ్ వాళ్లను పొగుడుతూ ట్వీట్లు పెట్టేది. యాదృచ్ఛికంగా రైట్ వింగ్ లో పోస్ట్ చేసిన ట్వీట్లు డిలీట్ అవుతూ ఉండేవి. ఈ సమాచారాన్ని మొత్తం రికార్డు చేసి రంబుల్ లో పోస్ట్ చేసింది.. రంబుల్ కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్. ఇది క్లౌడ్ సర్వీస్ అందిస్తుంది.

అయితే ఈ వీడియోని ఎలాన్ మాస్క్ చూశారని భావిస్తున్నారు.. ట్విట్టర్ ను ఓవర్ చేసుకోబోతున్నారు అని వార్త వచ్చిన తొలి నాళ్ళల్లో ఇది జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత ట్విట్టర్ని స్వాధీనం చేసుకోకుండా ఆపేస్తున్నానని చెప్పకనే చెప్పాడు. అంటే దీనిని బట్టి ట్విటర్లో ఎవరు ఎలాంటి పాత్ర పోషించారో అర్థం చేసుకోవచ్చు. గద్దె విజయ కుటుంబ నేపథ్యం లెఫ్ట్ వింగుకు అనుకూలంగా ఉండేది. అయితే ఆమె అటువంటి విధానాలనే ట్విట్టర్లో ప్రవేశపెట్టింది. పరాగ్ అగర్వాల్ కూడా తోడు కావడంతో ఇద్దరికీ అడ్డు అదుపు లేకుండా పోయింది. అందుకే కొన్ని ఖాతాల్లో ట్వీట్లు వాటంతట అవే డిలీట్ అవుతూ ఉండేవి. ఆ మధ్య సాగు చట్టాలపై దేశంలో నిరసనలు చెలరేగుతున్నప్పుడు.. దిశ రవి అనే ఒక మహిళ ప్రవర్తించిన తీరు అనుమానాస్పదంగా కనిపించింది. తీరా తెరిచి చూస్తే ట్విట్టర్ టూల్ కిట్ బయటపడింది. ఇలాంటి టూల్ కిట్లను పలు దేశాల్లో ట్విట్టర్ వాడుకలో పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి.
ఇలా బయటపడ్డాయి
మస్క్ ట్విట్టర్ని స్వాధీనం చేసుకోగానే అందులో ఉన్న లోపాలపై దృష్టి సారించాడు. ముఖ్యంగా ట్విట్టర్ బ్లూ స్కై ఎక్స్టెన్షన్ కలిగిన డాక్యుమెంట్ ని ప్రింట్ తీయగా విస్మయకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. బ్లూ స్కై ఆబ్జెక్ట్ డాక్యుమెంట్లో ఒక ప్రోగ్రాం ఉన్నట్టు తెలిసింది.. అందులో వందల సంఖ్యలో నకిలీ అకౌంట్లు సృష్టించగలిగే సామర్థ్యం పొందుపరిచి ఉంది. ఆ ఖాతాలో నుంచి పలానా వ్యక్తి పేరు మీద వందల్లో ఫిర్యాదులు వెళ్తాయి. దీంతో టార్గెట్ చేసిన వ్యక్తి ఖాతాను పూర్తిగా మూసేస్తారు. బహుశా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను కూడా ఇదే ప్రోగ్రాం ద్వారా వేలల్లో ఫిర్యాదులు వచ్చినట్టు రికార్డు చేసి శాశ్వతంగా తొలగించారు. ట్విట్టర్ లో ఉన్న ప్రోగ్రామింగ్ ప్రకారం రైటింగ్ సపోర్టర్ అయినప్పటికీ 100 లోనే ఫిర్యాదులు వెళ్తాయి.. అయినప్పటికీ వాటిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ట్విట్టర్ యాజమాన్యంపై ఉంది.. కానీ ఆ బ్లూ స్కై ఆబ్జెక్ట్ డాక్యుమెంట్ ద్వారా కోడ్ చేసిన ఫిర్యాదులు వేలల్లో వెళ్తాయి. ఎవరు ఫిర్యాదు చేశారో మాత్రం ట్విట్టర్ బయట పెట్టదు. ఏమని అడిగితే ఇది మా వ్యక్తిగత పాలసీ అని బదులిస్తుంది.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని ట్విట్టర్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు మస్క్ చేతిలోకి వచ్చింది కాబట్టి దిద్దుబాటు చర్యలు మొదలవుతున్నాయి. ఇదే సమయంలో వామపక్ష భావజాలం ఉన్న వారంతా ట్విట్టర్లో తమ ఖాతాలను తొలగించుకుంటున్నారు. అయితే డోనాల్డ్ ట్రంప్ కాతాను పునరుద్ధరించే పనిలో ఉన్నామంటూ మస్క్ తెలపడం గమనార్హం.