Pushpa Meme: ‘పుష్ప’ను అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులు కూడా బాగా మెచ్చుకుంటున్నారు. మెచ్చుకునే క్రమంలో బాగా వాడుకుంటున్నారు కూడా. అసలు ఎక్కడ చూసిన ‘పుష్ప’ ఫీవరే కనిపిస్తుంది ఇప్పుడు. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పుష్పరాజ్ డైలాగ్ ను ఎంచుకుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టిల్ ను ఎడిట్ చేసి బన్నీకి మాస్క్ పెట్టింది.
ఈ ఎడిట్ చేసిన ఫొటోపై తగ్గేదేలే డైలాగ్ ను.. డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే.. అని రాసింది. ఏదైనా మాస్క్ తీసేదేలే అనే నినాదాన్ని ప్రజలలో తీసుకువెళ్ళడానికి ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు అన్నమాట. ఏది ఏమైనా ఇదంతా బన్నీకి సంతోషాలను కలగజేసే అంశాలే. మొత్తమ్మీద ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఈ మధ్య తన రూట్ మార్చాడు.
ఇక నుంచి పాన్ ఇండియా సినిమాలను తలకెత్తుకుని ఆ ఇమేజ్ ను మెయింటైన్ చేస్తూ తనను తాను పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రమోట్ చేసుకోవాలని బన్నీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. పైగా తనకు అన్ని ఇండస్ట్రీల నుంచి సపోర్ట్ చేసేలా పావులు కదుపుతున్నాడు. నిజానికి పుష్ప సినిమా పై హిందీ హీరోలు, తమిళ హీరోలు.. చివరకు కన్నడ హీరోలు కూడా తెగ పాజిటివ్ కామెంట్స్ చేశారు.
Also Read: పుష్ప మూవీలోని మొగిలీస్ పాత్ర పోషించింది ఎవరో తెలుసా..?
బన్నీ వాళ్ళ చేత చేయించే ప్రాగ్రాం పెట్టాడనే వార్త ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మొత్తమ్మీద ‘పుష్ప సినిమా అదిరిపోయిందని, మెయిన్ గా అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది అని.. బన్నీకి హ్యాట్సాఫ్ అంటూ సినీ ప్రముఖులు తెగ ఎగ్జైట్ అయ్యారు. కాకపోతే, ఆ ఎగ్జైట్ వెనుక బన్నీ ఉన్నాడు. బన్నీ పాన్ ఇండియా స్థాయిలో అందరికీ టచ్ లోకి వెళ్లి పుష్ప పై పాజిటివ్ కామెంట్స్ చేయండి అని రిక్వెస్ట్ చేసి.. కొందరి హీరోల చేత, అలాగే కొంతమంది హీరోయిన్ల చేత కామెంట్స్ చేయించాడట.
దాంతో బన్నీని పొగుడుతూ.. ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్ర చేసి మెప్పించడం అద్భుతం అంటూ పబ్లిక్ గా మెసేజ్ లు వదిలారు సినీ ప్రముఖులు.
Also Read: ఇంట్రెస్టింగ్.. కరోనా ఇకపై ‘కాటు’ వేయదా?